విక్రమ్ 2 చిత్రంలో విలన్ సూర్య కాదా.? మరి ఎవరు?

విక్రమ్ 2 చిత్రంలో విలన్ సూర్య కాదా.? మరి ఎవరు?

by Anudeep

Ads

మన లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం మంచి టాక్ తో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ విక్రమ్ చిత్రం చివరిలో హీరో సూర్యని రోలెక్స్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు.

Video Advertisement

అయితే ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోకేష్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఖైదీ చిత్రానికి ఈ చిత్రానికి మధ్య కథను లింక్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఖైదీ మరిియు విక్రమ్ చిత్రాలు రెండింటిని ముడిపెట్టడంతో కార్తీ ఈ చిత్రంలో కంటిన్యూ అవుతాడని చెప్పకనే చెప్పాడు దర్శకుడు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో తాజాగా లోకేష్ సినిమాపై కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.  ఆ వార్త ఏంటంటే.. విక్రమ్ చిత్రం చివరిలో సూర్య విలన్ గా కనిపించారు.. అయితే విక్రమ్2 చిత్రంలో సూర్య విలన్ గా కంటిన్యూ అవుతారా.. లేదా.. అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2019 లో విడుదలైన ఖైదీ చిత్రం క్లైమాక్స్ లో ఢిల్లీలో అసలు విలన్ ఉన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చి వదిలేసాడు లోకేష్. అదేవిధంగా విక్రమ్ చిత్రంలోని చివరిలో విలన్ గా సూర్య ని ఎంటర్ చేశాడు.

అయితే ఈ రెండు చిత్రాల క్లైమాక్స్ గమనిస్తే విక్రమ్ 2, ఖైదీ 2 ఈ రెండు చిత్రాలకు కూడా సూర్యనే అయ్యుండొచ్చు అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం రోలెక్స్ గతాన్ని చూపించేందుకు సూర్యతో పూర్తి స్థాయిలో ఒక చిత్రాన్ని ప్లాన్ చేశాడట లోకేష్. అంటే సూర్య విలన్ గా మారడానికి కారణం వేరే ఉండదని ఈ చిత్ర సారాంశం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

విక్రమ్ చిత్రం రిలీజ్ తర్వాత లోకేష్ కనకరాజు యూనివర్స్ గురించి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం కథే విలన్ అనే  లోకేష్ ఇంతకుముందే చెప్పుకొచ్చారు.  యూనివర్స్ చిత్రంలో అందరు హీరోలు అయినప్పుడు, మరి విక్రమ్ 2 చిత్రంలో విలన్ ఎవరు అనేది వేచిచూడాలి.


End of Article

You may also like