టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ వయసు 38 ఏళ్ళు. థర్టీ ప్లస్ ఉండి కూడా పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్ టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో శర్వా తన పెళ్లి గురించి అడిగినా సమాధానం దాటేశాడు. అయితే శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇన్నాళ్లకు శర్వా తన బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పబోతున్నాడు. తాజాగా అతడు యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Video Advertisement

 

ఈ నేపథ్యం లో అసలు శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ఆమె ఫామిలీ బాక్గ్రౌండ్ ఏంటి అని చాలా మంది ఆరా తీస్తున్నారు. అయితే .రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని సమాచారం. అలాగే రక్షిత రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అట. ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబానికి శర్వానంద్ అల్లుడుగా అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుందని తెలిసింది.

sarvanad fiance details..

 

ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శర్వానంద్ కి రక్షితతో పరిచయం ఏర్పడిందట. అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టి ప్రేమికులుగా మారారు. వెంటనే కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు అని సమాచారం. వీరి పెళ్లి ఈ వేసవిలో జరగనున్నట్లు సమాచారం. అయితే జనవరి 26 జరిగిన నిశ్చితార్థం లో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

 

sarvanad fiance details..
ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే, ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మెప్పించాడు. ఆ తర్వాత మంచి కథలు సెలక్ట్ చేసుకుని హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు వరుసగా 5 ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. మరికొన్ని సినిమా కథలు వింటున్నట్లు తెలుస్తోంది.