సిరి – శ్రీహాన్ లను మమ్మీ, డాడీ అంటున్న ఆ బాబు ఎవరో తెలుసా..??

సిరి – శ్రీహాన్ లను మమ్మీ, డాడీ అంటున్న ఆ బాబు ఎవరో తెలుసా..??

by Anudeep

బిగ్ బాస్ తెలుగు ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రేక్షకుల ఆదరణను మరింత పెంచుకుంటుంది. మొదట్లో కొంత నీరసంగా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం కంటెస్టెంట్స్ వారి కుటుంబ సభ్యులు కలుసుకోవడంతో హై ఎమోషనల్ ట్రాక్స్ మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కోసం ఇంట్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమెతో వచ్చిన ఒక పిల్లవాడు ఎవరు అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Video Advertisement

 

వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు అందుకున్న సిరి హనుమంతు శ్రీహాన్ ఇద్దరికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీహాన్ కోసం ప్రత్యేకంగా హౌస్ లోకి వచ్చిన సిరి ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ ఇప్పటివరకు బాగానే ఆడావు అని ఇక ముందు కూడా నువ్వు అద్భుతంగా ఆడాలి అని అతనికి సపోర్ట్ చేసింది.

who is that boy with siri and srihan..

అలాగే సిరి వచ్చాక కొద్దిసేపటికే వాళ్ళు పెంచుకుంటున్న బాబు కూడా లోపలికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీహాన్ ని డాడీ సిరి ని మమ్మీ అని పిలవడంతో పెళ్లి కాకుండా వీళ్ళకు బాబు ఎలా వచ్చాడు అంటూ అందరూ షాక్ అయ్యారు. ఆ పిల్లాడు హౌస్ లోని కంటెస్టెంట్లందర్నీ ఇమిటేట్ చేస్తూ అందరిని అలరించాడు.

who is that boy with siri and srihan..

సిరి శ్రీహన్ ఇద్దరూ దత్తత తీసుకున్న ఆ బుడ్డోడి పేరు చైతు. అయితే ఈ బాబు ఎవరో కాదు స్వయానా సిరి మేనమామ కొడకట. ఇక ఈ విషయాన్ని సిరి తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సిరి బిగ్ బాస్ లో ఉన్న సమయం లో ఆమె తల్లి శ్రీదేవి ఎన్నో చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అప్పుడు ఆ బాబు ఎవరో కాదు స్వయానా మా తమ్ముని కొడుకే అంటూ సిరి తల్లి శ్రీదేవి అప్పట్లో ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

who is that boy with siri and srihan..

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి రాగానే చైతన్య, డాడీ అంటూ శ్రీహన్ దగ్గరికి వెళ్లిపోయాడు. ఇక శ్రీహన్ కూడా అతన్ని చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక విధంగా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల తరహాలోనే కనిపించారు. అయితే సిరి శ్రీహాన్ లు పెళ్లి చేసుకోక పోయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటారు. అలాగే ఈ బాబు చైతు కూడా వాళ్ళ దగ్గరే చాలా రోజుల నుండి ఉంటున్నాడు.


You may also like

Leave a Comment