యువ నటుడు అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ లుక్ హాలీవుడ్ హీరోలా ఉంది. ఏజెంట్ మూవీ ని నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా రూ.80 కోట్లతో అఖిల్ కెరీర్లో బిగ్ బడ్జెట్ సినిమాగా తీర్చిదిద్దాడు.

Video Advertisement

 

 

ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. అయితే ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వస్తోంది. చాలా గ్యాప్ తీసుకొని ఏజెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు అఖిల్. గత సంవత్సరం నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాఏప్రిల్ 28 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో.. ఉంగరాల జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నారు.

who is the akhil's next movie director..!!

అయితే ఈ మూవీ కోసం అఖిల్ రెండేళ్లకు పైగా సమయం కేటాయించాడు. కానీ దానికి తగిన ఫలితం రాలేదు. అయితే ఈ మూవీ కి డిజాస్టర్ టాక్ రావడం తో అఖిల్ తదుపరి చిత్రం ఏ డైరక్టర్ తో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అఖిల్ ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ అప్డేట్ ని ఇవ్వలేదు.

who is the akhil's next movie director..!!

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు వంశి పైడిపల్లి తో తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక వంశీ పైడిపల్లి ఇటీవల విజయ్ హీరోగా వారసుడు చిత్రం చేసారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. పక్కా కమర్షియల్ సినిమాలు చేసే వంశీ పైడిపల్లి దర్శకుడు కావటంతో అఖిల్ తో తన నెక్స్ట్ సినిమా ప్రకటిస్తే మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.