రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న చిత్రం ఆదిపురుష్‌. మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Video Advertisement

 

 

రామాయణం నేపథ్యంలో 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

who is the first choice for sita in adipurush..??

అయితే తాజాగా సీతా నవమి సందర్భంగా కృతిసనన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న స్పెషల్ మోషన్ పోస్టర్ మంత్ర ముగ్ధులను చేసింది. జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ లో సీత పాత్ర కి ముందుగా కృతిసనన్ ని అనుకోలేదట మేకర్స్.

who is the first choice for sita in adipurush..??

ఈ మూవీ లో ప్రభాస్ సరసన సీత గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తీసుకుందాం అనుకున్నారట. కానీ వరుస సినిమాలతో బిజీ గా ఉండటం తో దీపికా ఒప్పుకోలేదట. అంతే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కూడా దీపికా నే కథానాయిక. ఇక దీపికా తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్, పూజ హెగ్డే ల పేర్లను కూడా పరిశీలించారట మేకర్స్. చివరికి ఈ పాత్ర కృతిసనన్ కి చేరింది.

who is the first choice for sita in adipurush..??

ఇక మరో వైపు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు మేకర్స్. ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ దర్శకుడి పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. దీంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ను కాస్త బెటర్‌ చేసేందుకు ప్రయత్నించింది. అందుకే గత ఏడాది ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతోంది.