Ads
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా..? పాత తరం సినిమాల్లో ఈయన ఎక్కువగా విలన్ గా కనిపించేవారు. ఈయనని అందరు రాజనాల అని పిలుచుకుంటూ ఉంటారు. ఈయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పాత తరం సినిమాల్లో విలన్ అంటే ఈయన పేరే అందరికి గుర్తొస్తుంది. అంతగా తెరపై క్రూరత్వాన్ని పండించేసారు ఈయన.
Video Advertisement
అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పట్లోనే ఈయన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధం అయిపోయారు. నాలుగొందల చిత్రాలకు పైగా నటించిన రాజనాల చాలా వైవిధ్యమైన విలన్ పాత్రలను పోషించారు.
దొంగల ముఠా నాయకుడిగా, భూకామందుగా, జరాసంధుడు, మాయల ఫకీరు వంటి పాత్రలలో నటించడంలో రాజనాల సిద్దహస్తుడు. ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ, హిందీ, కన్నడ చిత్రాలలో కూడా నటించి లెక్కలేనంత అభిమానగణాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. 1951 లో రాజనాల మిత్రుడైన లక్ష్మి కుమార్ రెడ్డి సాయంతో “ప్రతిజ్ఞ” సినిమా ద్వారా రాజనాల తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతోనే ఆయనకు ఎన్టీఆర్ “వద్దంటే డబ్బు” సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు మామగా ముసలి పాత్రలో నటించారు.
ఇది కూడా మంచి పేరు తెచ్చిపెట్టడంతో రాజనాల వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1966 లో రాజనాలకు హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చింది. “మాయ ది మెగ్నిషియంట్” అనే సినిమాలో నటించిన రాజనాల హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పాతికేళ్ల పాటు ఆయన విలన్ గా, హాసినటుడిగా నటించి, మెప్పించి ఎనలేని ఖ్యాతి తెచ్చుకున్నారు.
End of Article