మహాభారతంలో అత్యంత దురదృష్టవంతురాలు అయిన పాత్ర ఏదో తెలుసా..?

మహాభారతంలో అత్యంత దురదృష్టవంతురాలు అయిన పాత్ర ఏదో తెలుసా..?

by Mounika Singaluri

Ads

మహాభారతం అందరికి తెలిసినదే.. కానీ పూర్తి గ్రంధాన్ని తెలుసుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ మధ్య కాలం లో మహాభారతం పైన కధలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ గా వస్తున్నాయి కాబట్టి ఈ మాత్రం అవగాహనా అయినా ఏర్పడుతోంది. మహాభారతం ఎన్ని సార్లు చదివినా.. చూసినా.. ప్రతిసారి ఓ కొత్త విషయం బోధపడుతూ ఉంటుంది.

Video Advertisement

తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే.. యుగాలు గడుస్తున్నా.. భారతం నుంచి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది.

hidimbi 1

మహాభారతంలో లేనిది ఈ లోకం లోనే లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి విషయం, మనుషుల ప్రతి లక్షణం గురించి భారతంలో ముందే వివరించబడి ఉందని చెబుతూ ఉంటారు. మహాభారతంలో దురదృష్టవంతురాలైన పాత్ర ఎవరిదీ అన్న ప్రశ్న వస్తే..? చాలా మంది ద్రౌపది పేరుని తలుచుకుంటూ ఉంటారు. కానీ.. మహాభారతంలో ద్రౌపది కంటే దురదృష్టవంతురాలైన పాత్ర మరొకటి ఉంది.

hidimbi 2

ఆమె పేరే హిడింబి. ఆమె ఘటోత్కచుని తల్లి. భర్తని ఎంతగానో ప్రేమించినా… కొడుకు పుట్టగానే.. ఆమెను భర్త వదిలేయడంతో అరణ్యంలోనే బతికింది. భర్త యువరాజైనా.. మహారాణి హోదాలో ఉండాల్సిన ఆమె అరణ్యంలో ఒంటరిగా కొడుకుని చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది. భర్త చేతిలోనే అన్నని కోల్పోయింది. తిరిగి.. భర్త అడిగాడన్న కారణంతోనే కొడుకుని యుద్ధానికి పంపింది. యుద్ధంలో కొడుకుని కూడా కోల్పోయింది. తన అనుకున్న అన్నని కోల్పోయింది.. భర్త ప్రేమని నోచుకోలేకపోయింది.. చివరకు ఒక్కగానొక్క కొడుకునీ యుద్ధంలో కోల్పోయింది.. జీవితాంతం బాధని అనుభవించింది. అందుకే ఆమెను దురదృష్టవంతురాలిగా పేర్కొనవచ్చు.

hidimbi 3

అయితే.. ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర దురదృష్టవంతమైన పాత్రగా అనిపించవచ్చు. మహాభారతంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన వెనుకా.. ఎన్నో నిగూడార్ధాలు, జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. అందుకే మహా భారతాన్ని గ్రంధంగా పేర్కొన్నారు. ఈ గ్రంధాన్ని నిత్యం చదువుతూ.. పరిస్థితులను.. ఆ పాత్రలు నేర్చుకున్న పాఠాలను ఆకళింపు చేసుకుని.. ప్రస్తుతం జీవితంలో అన్వయించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


End of Article

You may also like