Ads
నందమూరి కల్యాణ రామ్ తెలుగువారికి సుపరిచితుడే. నిర్మాత కూడా కళ్యాణ్ రామ్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇటీవల కల్యాణ రామ్ కు సరైన హిట్స్ లేవు. అయితే.. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ పాటికే ఆ సినిమా “బింబిసార” అని మీకు అర్ధం అయ్యే ఉంటుంది.
Video Advertisement
పీరియాడిక్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యం ఉన్నదా..? లేక కాల్పనిక సోషియో ఫాంటసీ మూవీ నా అన్న సంగతి తేలాల్సి ఉంది.
ఈ సినిమా బాహుబలి లెవెల్ లో ఉండబోతోందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ గెటప్ కూడా ఓ వీర యోధుడిని పోలి ఉంది. “ఎంతమంచివాడవురా” సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నుంచి సినిమాలు రాలేదు. ఈ సినిమా పై నందమూరి ఫాన్స్ బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
“పట్టుమని 100 మంది అయినా లేరు.. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చూస్తారు..”, ” రాక్షసులు ఎరుగని రావణ రూపం…” అంటూ వచ్చే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. మాస్ ఆడియెన్స్ అయితే ఈ ట్రైలర్ ను రిపీట్ మోడ్ లో చూసేస్తున్నారట. అయితే.. ఇంత పవర్ఫుల్ గా డైలాగ్స్ రాసిన వ్యక్తి ఎవరా? అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారట. ప్రస్తుతం అతనికి ఫుల్ డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది.
బింబిసార సినిమాకి డైలాగ్స్ రాసిన రైటర్ పేరు వాసుదేవ్ మునెప్పగారి. ఇంతకుముందెప్పుడు అతను ఏ సినిమాకీ డైలాగ్స్ రాయలేదు. సినిమాలకు మాటలు రాసిన అనుభవమేమీ లేదు. ఇదే అతనికి మొదటి సినిమానట. ఆయన వయసు కూడా కేవలం 28 సంవత్సరాలే అవడం మరో విశేషం. ఇది అతనికి మొదటి సినిమానే అయినా.. ఎంతో అనుభవం ఉన్న రచయిత రాసినట్లుగా ఈ డైలాగ్స్ రాసాడు. ఇలాంటి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించినందుకు కళ్యాణ్ రామ్ ని కూడా నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. బింబిసార ట్రైలర్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవడానికి అతను రాసిన డైలాగ్స్ కూడా ఓ కారణమే.
End of Article