Ads
పెళ్లి అనేది ఎవరి జీవితం లో అయినా మధుర ఘట్టమే. తమ జీవితాన్ని పంచుకోవడానికి అనువైన జీవిత భాగస్వామిని ఎంచుకుని, పెద్దలందరి సమక్షం లో జంట కావడానికి పెళ్లి అనే వేడుకని జరుపుకుంటారు. అయితే.. ఈ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయం లో పెద్దలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ కుమార్తె లేక కుమారుడికి అనువైన తోడుని వెదికే పనిలో బిజీ అయిపోతున్నారు.
Video Advertisement
నిజానికి ఈ పని ఎవరు చేసుకోవాలి..? జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం కానీ, అవకాశం కానీ ఎవరికి ఇవ్వాలి..? ఈ విషయమై శ్రీ కృష్ణ భగవానుడు ఏమంటున్నాడో చూద్దాం.
కలియుగం లో వచ్చే అనుమానాలన్నిటికి భారతం లో తప్పక సమాధానం లభిస్తుంది అంటూ ఉంటారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉందో చూద్దాం. శ్రీకృష్ణ, బలరాములు అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. వీరికి సుభద్ర చెల్లెలు. సుభద్ర పుట్టినప్పుడే దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారట. కానీ.. వయసుకు వచ్చాక సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తుంది. అర్జునుడిని పెళ్లాడాలని భావిస్తుంది.
కానీ, ఇందుకు బలరాముడు అంగీకరించడు. సుభద్ర వివాహం దుర్యోధనుడితో జరగాలని చిన్నప్పుడే నిశ్చయమైంది అని అంటాడు. అప్పుడే శ్రీ కృష్ణుడు కలగచేసుకుంటాడు. నిశ్చితార్ధం అయితే వివాహం అయినట్లు కాదని వాదిస్తాడు. నిశ్చితార్ధానికే వివాహం అయిపోయిందని భావిస్తే.. కన్యాదానానికి విలువ ఏముందని ప్రశ్నిస్తాడు. పెళ్లి అయ్యాక జీవితాంతం కలిసి ఉండాల్సింది సుభద్ర అని గుర్తుచేస్తాడు. కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఆమెకే ఇవ్వాలని అంటాడు.
తల్లితండ్రులైనా, అన్నా వదినలు అయినా ఆ అధికారాన్ని త్యాగం చేయాలని చెబుతాడు. వధూవరుల ఇష్టానికే ప్రాముఖ్యతను ఇచ్చి వివాహ నిశ్చయం జరగాలని చెబుతాడు. మనసులు కలవకుండా జరిగే మనువు అర్ధం లేదని చెప్పకనే చెబుతాడు. బలరాముడు సుభద్రను తీసుకెళ్లిన వారిపై దండెత్తాలని శ్రీకృష్ణుడికి పిలుపునివ్వగా.. శ్రీకృష్ణుడు అందుకు నిరాకరిస్తాడు. బలగం సిద్ధం గా ఉందని, కానీ దండెత్తాల్సింది ఆయుధాలు లేని ఓ స్త్రీ పై అని చమత్కరిస్తాడు.
అంటే.. సుభద్రే మనసిచ్చి అర్జునుడితో వెళ్ళడానికి సిద్ధపడింది అని చెబుతాడు. తన అన్న బలరాముడికి నచ్చ చెప్పి.. సుభద్ర ఇష్టపడ్డ అర్జునుడితోనే వివాహాన్ని జరిపిస్తాడు. ఆ తరువాత సుభద్ర అర్జునులు అన్యోన్యంగా కలిసి జీవిస్తారు. వారికి అభిమన్యుడు జన్మిస్తాడు.
End of Article