Ads
తాజాగా పెట్రోల్ ధరలు లీటర్ వందకు చేరడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం లో పెట్రోల్ రేటు పైసల్లో పెరిగినా కూడా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో రచ్చ చేసేవారు. కానీ ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర దాదాపు వంద రూపాయలకు చేరుకుంది. కానీ దీనిపై ఎవరు స్పందించడం లేదు. కానీ, ఓ మహానుభావుడు మాత్రం ఈ పెట్రోల్ ధర పెంపుని కూడా దేశ అభివృద్ధి కి మంచి చేస్తుందన్న రేంజ్ లో పొగిడేస్తున్నాడు..
Video Advertisement
వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ ను మీరు చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ మెసేజ్ సారాంశమేమిటంటే.. పెట్రోల్ రేటు ఖరీదుని బట్టే దేశ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉంటుందట. క్రూడాయిల్ ధర తగ్గినప్పుడల్లా మనం కూడా ధర తగ్గించుకుంటూ పొతే సమాజం లో పలువురికి వచ్చే ఆదాయాలు తగ్గిపోతాయట. ఓ ఆటో వ్యక్తి కి వచ్చే కిరాయి గురించి అతడు ఓ ఉదాహరణను కూడా చెప్పాడు.
పెట్రోల్ ఎక్కువ ధర ఉన్నపుడు ఆటో వారికి కొత్తగూడెం నుంచి లోకల్ కి రావడానికి ఇరవై రూపాయల కిరాయి లభిస్తుందనుకుంటే..రోజుకి వేయి రూపాయల కిరాయి వస్తుంది. పెట్రోల్ రేట్ లు తగ్గిపోతే అతనికి రోజుకు ఐదువందల రూపాయలే వస్తాయి. అలాగే కూలి వ్యక్తికీ వచ్చే కిరాయి కూడా చాలా తగ్గిపోతుందట. మార్కెట్ రాకపోకలకు, ప్రభుత్వాలకు వచ్చే ఆదాయానికి మనం కొనే పెట్రోల్ కారణమట.
నవ్వొస్తోంది కదా.. అతను ఇక్కడితో ఆగలేదు.. గ్రూపు లో తనకంటే ఎక్కువ తెలిసిన వారున్నారని.. ఎక్కువ చెప్పి ఇబ్బంది పెట్టినందుకు సారీ అని కూడా చెప్పాడు. ఇది ఇపుడు వాట్సాప్ గ్రూప్ లలో సర్క్యూలేట్ అవుతోంది. అందరు దీనిని చూసి నవ్వుకుంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతాయని అతనికి అనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆటోవాడికైనా కిరాయి ఎక్కువ వచ్చినా.. నిత్యావసరాల కోసం ఎక్కువ మొత్తం లో ఖర్చు పెట్టాలి కదా..? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా..? అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
End of Article