Ads
ప్రతి ఒక్కరి జీవితం లోను కళ్యాణం అనేది ఓ మధుర ఘట్టం. ఈ వివాహ సంప్రదాయం లో ఇద్దరు వ్యక్తులే కాదు. రెండు కుటుంబాలను కలిపే కమనీయ వేడుక. హైందవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన ప్రాధాన్యత ఆ పెళ్లి జరిపించే విధివిధానాలకు, ఆచారాలకు మరియు సంప్రదాయాలకు ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి అంటే ఐదో రోజుల నుంచి పదహారు రోజుల పాటు పండుగలా జరుపుకునేవారు.
Video Advertisement
ఆకాశమంత పందిరి.. భూదేవి అంత వివాహ వేదికను సిద్ధం చేసి బంధుమిత్రులందరినీ ఒకే చోటకు చేర్చి పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెలను దీవించేవారు. అయితే కాలానికి అనుగుణంగా వివాహ సంప్రదాయాల్లో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే మూడు ముళ్ల తంతును ముగించేస్తున్నారు. అయితే ఎన్ని మార్పులొచ్చినా భారతీయ వివాహ పద్ధతుల్లో మార్పులు మాత్రం రాలేదు. వాటిలో ముఖ్యమైనవి తాళి ,తలంబ్రాలు, బాసికం, అడ్డుతెర.
మన సంప్రదాయం ప్రకారం జరిగే వివాహాలలో అతి ముఖ్యమైన అంశం అడ్డుతెర. ని వెనక ఆధ్యాత్మికమైన శాస్త్రీయపరమైన కొన్ని కారణాలు లాభాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. పెళ్ళిలో కీలక ఘట్టమైన జీలకర్ర బెల్లానికి ముందు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కి మధ్య అడ్డుతెర కడతారు. దానికి అర్థం వారిద్దరూ విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తులు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత వారిద్దరూ ఒకటని అర్థం అందుకే అప్పుడు ఆ అడ్డు తెరని తొలగిస్తారు. అప్పుడు ఆ ముహూర్తం పెట్టిన సమయానికి వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అలా చేస్తే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉంటారని నమ్మకం. ఈ అడ్డు తెరపై దేవుడి బొమ్మలను ముద్రిస్తారు.
ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల వరకు చూడాలని పెద్దలు చెబుతుండేవారు. కానీ ఇప్పుడు ఒక రెండు లేదా మూడు తరాల వరకే చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి కార్యక్రమాలు పెళ్లి చూపుల నుంచి మొదలై.. నిశ్చితార్థం, వినాయకుడికి బియ్యం సమర్పించడం.. వధూవరులను అందంగా ముస్తాబు చేయడం.. గౌరీ పూజ చేయడం.. కాళ్లు కడగడం.. జీలకర్ర బెల్లం వధూవరులు తలపై జీలకర్ర-బెల్లం ఉంచుకోవడం.. అనంతరం వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టడం.. తలంబ్రాలు, ఉంగరాల ఆట, అరుంధతీ నక్షత్రం చూడటంతో ముగిస్తున్నారు.
End of Article