పాన్ ఇండియా హీరోగా ఈ ఏడాది వరుసగా రెండు హిట్ సినిమాలతో ఎదిగిపోయిన అడవి శేష్.. హీరోగా తనకి లైఫ్ ఇచ్చిన గూఢాచారి మూవీకి వచ్చే ఏడాది సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి అడవి శేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించనున్నాడు. 2018లో వచ్చిన గూఢచారి సినిమా అడవి శేష్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో అడవి శేష్ నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్‌ యూత్‌కి విపరీతంగా నచ్చాయి.

Video Advertisement

 

 

అయితే గూఢచారి సీక్వెల్ కి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 09, 2023న ప్రకటిస్తామని ఓ పోస్టర్‌‌ను విడుదల చేశారు. ఆ ఫోస్టర్‌లో గూఢచారి 2 లోగో తో పాటు ప్రధాన నటుడు అడివి శేష్ తుపాకీని పట్టుకున్నట్లు చూపించారు. ఈ సినిమాకు విజయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.

why adivi sesh is changing gudachari sequel director..

అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ సినిమాతో వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో ‘మేజర్’ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు చూసింది ఇతనే. అయితే ఈ చిత్రం నుంచి గూఢచారి డైరెక్టర్ శశి కిరణ్ ని ఎందుకు తప్పించారు అన్నదానిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

why adivi sesh is changing gudachari sequel director..

గూఢచారి చిత్రానికి శశి కిరణ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మేజర్’ ఏకంగా పాన్ ఇండియాలోనే సంచలనం సృష్టించింది. ఆ రకంగా శేష్ ఎదుగదలలో శశి కీలక పాత్రధారిగా ఉన్నాడు. గూఢచారి అంత పెద్ద సక్సెస్ కాకపోతే శేషు అంత ఫేమస్ అయ్యేవాడు కాదు. ‘మేజర్’ సక్సెస్ లోనూ శశి అంతకు మించిన గొప్ప పాత్ర పోషించాడు. శేషు-శశి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయా? లేక కొత్త మేకర్ అయితే మేకింగ్ పరంగా ఛేంజోవర్ ఉంటుందని శేషు ఇలా ప్లాన్ చేస్తున్నాడా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.