కోలీవుడ్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రం లో పుట్టినా త‌మిళంలో హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు. అక్క‌డ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నాడు. ఈయ‌న‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో కూడా విడుద‌ల చేస్తుంటారు.

Video Advertisement

 

ఈ సంక్రాంతికి అజిత్ `తునివు` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాను `తెగింపు` టైటిల్ తో తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. డైరెక్ట‌ర్ హెచ్.వినోద్, అజిత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో మంజు వారియ‌ర్ హీరోయిన్ గా న‌టించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. గిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

why ajith is not attending movie pramotions..!!

బోనీ క‌పూర్ నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. మ‌రోవైపు మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాకు మ‌రింత హైప్ ఇస్తున్నారు. కానీ అజిత్ ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమాకే కాదు అసలు అజిత్ తన సినిమాల ప్రమోషన్స్ లో ఎప్పుడు కనిపించడు. పదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన కారణం గా అజిత్ ప్రమోషన్స్ లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడట.

why ajith is not attending movie pramotions..!!

తమిళనాట ఎప్పటి నుంచో అజిత్, విజయ్ సినిమాల మధ్య బాగా పోటీ న‌డుస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య త‌ర‌చూ వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ప‌దేళ్ల క్రితం ఓ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెట్ లో అజిత్ పాల్గొన్నాడు. అయితే ఆ ఈవెంట్ తో అజిత్‌, విజ‌య్ అభిమానుల మ‌ధ్య ఓ వివాదం చోటు చేసుకుందట. ఈ వివాదంలో ఓ అభిమాని క‌న్నుమూశాడ‌ట‌. ఆ సంఘ‌ట‌న అజిత్ ను ఎంత‌గానో క‌ల‌వ‌ర ప‌రిచింద‌ట‌. ఇక అప్ప‌టి నుంచి అజిత్ ప్ర‌మోష‌న్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.