కొన్ని ప్రొడక్ట్స్ ని రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఎందుకు ఇచ్చేస్తుంది..? దీని వెనుక అసలు లాజిక్ ఏంటంటే?

కొన్ని ప్రొడక్ట్స్ ని రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఎందుకు ఇచ్చేస్తుంది..? దీని వెనుక అసలు లాజిక్ ఏంటంటే?

by Mohana Priya

Ads

ఇంతకు ముందు మనం ఏ వస్తువు కొనాలన్నా పనిగట్టుకొని ఎండలో బయటకు వెళ్ళే వాళ్ళం. ఆపసోపాలు పడుతూ ఆ నిత్యావసరాలను ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. కానీ టెక్నాలజీ మారేకొద్దీ మనిషి జీవిత విధానం కూడా మారిపోయింది.

Video Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ షాపింగ్ అనేది అందరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఏ చిన్న వస్తువు కావాలన్నా ఆన్లైన్ ద్వారా కొనుక్కోవడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. ఈ అలవాటు ఆసరాగా అనేక ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి.

అమెజాన్, షాప్ క్లూస్, మైత్ర, ఫ్లిప్కార్ట్  వంటి అనేక ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లు చాలా వరకు ఉన్నాయి. మనం కావలసిన వస్తువులు సెలెక్ట్ చేసుకుని జస్ట్ బై బటన్ క్లిక్ చేసి డీటెయిల్స్ చేస్తే ఒక వారంలో ఆ వస్తువు మన ముందుకు వచ్చేస్తుంది.

అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనకు మొదటి నుంచి అలవాటైన అమెజాన్ లో చాలామంది తక్కువ రేటు వస్తువు నుంచి చాలా ఖరీదైన వస్తువులు వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు దారులు కొనుగోలు చేసే చిన్న చిన్న వస్తువులను ఒకసారి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల గాని, డామేజ్ వల్ల గాని తిరిగి రిటర్న్ ఇచ్చేస్తాం. ఆ ప్రోడక్ట్ కు గాను అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ మన సొమ్ముని  మనకు తిరిగి రెండు మూడు రోజుల వ్యవధిలో రిఫండ్ చేస్తుంది.

ఇలా ఇచ్చిన వస్తువు సొమ్ము రిఫండ్ చేయడానికి అమెజాన్ సమస్థ ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తుంది.  ఏంటంటే.  ఖరీదు తక్కువ గల వస్తువులను అమెజాన్ లక్షల ప్రొడక్ట్స్ ని రిటన్ తీసుకోకుండానే పడవేస్తుంది.

ఎందుకంటే ఆ వస్తువు కొన్న వెల మరియు దాని పంపించడానికి అయ్యే ఖర్చు కన్నా,  ఆ వస్తువు తిరిగి సెల్లర్ కి పంపించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్లనే తీసుకున్నా రిటన్ తీసుకున్న ప్రోడక్ట్ ని తిరిగి వ్యాపారికి పంపడం కన్నా పడవేయడం మంచిదని అమెజాన్ భావిస్తుంది.


End of Article

You may also like