అంబులెన్స్ మీద ఎందుకు ‘Ambulance’ అన్న పదం రివర్స్ లో ఉంటుందో మీకు తెలుసా..?

అంబులెన్స్ మీద ఎందుకు ‘Ambulance’ అన్న పదం రివర్స్ లో ఉంటుందో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

అంబులెన్స్ మనకి చాలా ఉపయోగకరం. హఠాత్తుగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆక్సిడెంట్ వంటివి అయినప్పుడు వెంటనే ఆసుపత్రికి చేరుకోవడానికి అంబులెన్స్ మనకి సహాయపడుతుంది. అర్ధరాత్రి సమయంలో అయినా మరి ఎప్పుడైనా సరే సులభంగా ఆసుపత్రికి చేరుకోవడానికి అంబులెన్స్ సౌకర్యంగా ఉంటుంది. మొట్టమొదట అత్యవసర రవాణా కోసం 1987లో స్పానిష్ వారు అంబులెన్స్ ని వాడారు.

Video Advertisement

ఎప్పుడైనా మీరు రోడ్డు మీద వెళ్తుంటే.. మీ వెనుక అంబులెన్స్ వస్తుంటే ముందు దానికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే లోపల ఒక రోగి ఇబ్బందితో ఉంటాడు. త్వరగా ఆస్పత్రికి చేరుకుంటే వైద్యం అందుతుంది. కనుక ఎప్పుడైనా సరే అంబులెన్స్ రోడ్డు మీద వెళుతూ ఉంటే మీ వాహనం అడ్డుగా ఉండకుండా చూసుకోండి.

ఇక అంబులెన్స్ మీద ముందు అంబులెన్స్ అని ఇంగ్లీషులో రివర్స్ లో రాసి ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా..? మీకూ సందేహం కలిగింద..? ఎందుకు రివర్స్ లో రాసి ఉంటుంది అని.. మరి దాని వెనక ఉండే కారణం గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని అంబులెన్సుల పైన అంబులెన్స్ అన్న పదం ఆంగ్లంలో రివర్స్ లో రాసి ఉంటుంది.

ఎందుకు అలా రాస్తారు అనేది చూస్తే… అంబులెన్స్ వెళ్లేటప్పుడు ఎదురుగా వాహనాలు ఉంటాయి కదా ఆ వాహనాలు నడిపే వాళ్ళు అద్దంలో దానిని చూస్తే అంబులెన్స్ అని క్లియర్ గా కనబడుతుంది. అదే ఒకవేళ మామూలుగా రాసి ఉంటే రివర్స్ లో అద్దం లో కనబడుతుంది. దీనితో అదేంటో చదివి దారి ఇవ్వడానికి సమయం పడుతుంది. అందుకని త్వరగా దారి ఇవ్వడానికి అంబులెన్స్ అన్న పదాన్ని రివర్స్ లో రాస్తారు. దీనితో ఎదురుగా వెళ్లే వాహన డ్రైవర్ కి ఆ పదం అద్దంలో క్లియర్ గా కనపడుతుంది. అది ఆంబులెన్స్ అని వెంటనే దారి ఇవ్వడానికి అవుతుంది.


End of Article

You may also like