ఒకప్పటి పాపులర్ హీరోయిన్ అమృత సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు..? ఆ సినిమా వల్లేనా?

ఒకప్పటి పాపులర్ హీరోయిన్ అమృత సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు..? ఆ సినిమా వల్లేనా?

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇందులో అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి అవకాశం వస్తే.. తామేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అవకాశాలు వచ్చిన తరువాత కూడా కొంతమంది నిలదొక్కుకోలేకపోతుంటారు.

Video Advertisement

ఎంత టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రావడానికి.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కొంత అదృష్టం తోడవ్వాల్సి ఉంటుంది. నటి అమృత కూడా ఆ కోవకే చెందింది. తక్కువ టైం లోనే పాపులర్ అయిన ఈ నటి తక్కువ టైం లోనే తెరని వీడి వెళ్ళిపోయింది.

amrutha 1

ఇంతకీ ఈ అమృతని ఎవరో గుర్తుపట్టారా..? ఆరుగురు పతివ్రతలు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమెకు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. వాస్తవానికి అమృత కన్నడ సినిమా హీరోయిన్. దర్శకుడు ఈవీవీ ఈమెను ఆరుగురు పతివ్రతలు సినిమాతో తెలుగు తెరకి కూడా పరిచయం చేసారు. అయితే నిజజీవితంలో ఆరుగురు మహిళల జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమాగా తెరకెక్కించారు. ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ట్విస్ట్ లతో ఈ సినిమాను తెరకెక్కించడానికి చాలానే కష్టపడాల్సొచ్చింది.

amrutha 2

ఈ సినిమాలో అమృత పెళ్ళై పిల్లలు ఉన్నా.. ఊరంతా సంబంధం పెట్టుకుని సంసారం సాగించే పాత్రలో నటించింది. ఆరోజుల్లో ఇలాంటి సినిమా తీయడం కష్టమే. అయినప్పటికీ ఈ పాత్రని ప్రేక్షకులు బాగా గుర్తుంచుకునేలా ఈ సినిమాను తీశారు. అయితే ఈ సినిమా చూసాక ఆమెను ప్రేక్షకులు మరో పాత్రలో ఊహించుకోలేకపోయారు. ఆమె అంతలా నటించారు. కానీ అన్నీ అలాంటి పాత్రలే వస్తుండడంతో అమృత తెలుగు సినిమాలను వదిలేసుకున్నారు. పెళ్లయ్యాక అమెరికాకు వెళ్లిపోయారు. అయితే.. అక్కడ ఆమె ఓ కేసులో ఇరుక్కున్నారని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె బెంగుళూరు లోనే ఉంటున్నారని సమాచారం.


End of Article

You may also like