దాదాపు 9 ఏళ్లు జబర్దస్త్ యాంకర్‌గా సక్సెఫుల్ జర్నీ సాగించిన యాంకర్ అనసూయ.. ఇటీవల జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఎటువంటి వివాదాల జోలికి పోకుండా మర్యాదగానే ఆమె ఆ షో నుంచి బయటకి వచ్చింది. అయితే ఆమె జబర్దస్త్ మానేయడానికి కారణమేంటో తెలీదు కానీ ఈ విషయం పై ఆమె ఫాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అందానికి అందం, టాలెంట్ ఉన్న ఈ అమ్మడు.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. అలాగే, సినిమాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. అయితే ఆమె జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చిందో ఇప్పటి వరకు తెలియరాలేదు.

Video Advertisement

 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అనసూయ తనకు జబర్దస్త్ ను విడిచి రావడానికి గల కారణాలను వివరించింది. జబర్దస్త్ కి ముందు అనసూయ కొన్ని ఈవెంట్స్ కి హోస్ట్ గా చేసింది, న్యూస్ రీడర్ గా కూడా పనిచేసింది. తర్వాత జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడింది. దీంతో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంది.

why anasuya left jabardasth..!!
ఈ నేపథ్యం లో ఆమె సినిమాల్లో కూడా భారీ అవకాశాలనే దక్కించుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా సినీ నటిగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోంది. “నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.. షూటింగ్ కోసం అడ్జెస్ట్‌మెంట్ అడిగినప్పుడు నాకే గిల్టీగా అనిపిస్తుంది. అంతమంది చేస్తున్నారు.. నా కోసం షెడ్యుల్ మార్చడం కరెక్ట్ కాదని అనిపించింది” అని అనసూయ తెలిపారు.

why anasuya left jabardasth..!!

“జబర్దస్త్ లో నాకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయి కానీ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇవన్నీ తప్పవు. ఆ ఊబిలో ఇరుక్కోవాలని నాకు అనిపించలేదు. అలాగే న ఒరిజినల్ ఫీలింగ్స్ ప్రేక్షకులకి చేరేవి కాదు. బాడీ షేమింగ్.. వెకిలి చేష్టలు నాకు నచ్చవు. అలంటి ఈనో సందర్భాలను నేను ఎదుర్కొన్నాను. అలాగే నాగబాబు గారు వెళ్లిపోయారు.. రోజా గారు వెళ్లిపోయారు.. ఇంకా చాలామంది వెళ్లిపోయారు కదా.. అందుకే నేను కూడా మానేస్తున్న అనడం కరెక్ట్ అక్కదు. నేనేమి గొర్రెల మందని కాదు.” అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.