“అన్నేమో అలా..తమ్ముడేమో ఇలా?”… ముకేశ్ అంబానీ ఎదిగినట్టు అనిల్ అంబానీ ఎందుకు ఎదగలేకపోయారు?

“అన్నేమో అలా..తమ్ముడేమో ఇలా?”… ముకేశ్ అంబానీ ఎదిగినట్టు అనిల్ అంబానీ ఎందుకు ఎదగలేకపోయారు?

by Mohana Priya

Ads

2002 లో వ్యాపార దిగ్గజం ధీరూభాయ్‌ అంబానీ మరణాంతరం అంబానీ సోదరుల మధ్య మనస్పర్థలు మొదలు అయ్యాయి. తల్లి కోకిలాబెన్‌ బిడ్డల మధ్య సయోధ్య కోసం ఎంతో ప్రయత్నించింది. చివరకు విడిపోయి.. వ్యాపారాలు పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు అంబానీ బద్రర్స్‌. ఆయిల్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాలను అన్న ముఖేష్ అంబానీ ఎంచుకుంటే.. పవర్‌, టెలికామ్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను తమ్ముడు అనిల్‌ తీసుకున్నాడు.

Video Advertisement

అప్పటి నుంచి ఇద్దరిదీ ఎడమొహం పెడమొహం. కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్‌ నవ్వులతో ఎదురుపడ్డా.. ఆప్యాయంగా పలకరించుకుందే లేదు. అయితే వ్యాపారంలో.. ముఖేష్‌ అంబానీ సంపద.. పెరుగుతూ పోతోంది.

story of ambani brothers

ఆసియాలోనే అపర కుబేరుడు అయ్యాడు ముఖేష్‌ అంబానీ. కానీ, అనిల్‌ అంబానీ సంపద మాత్రం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం అన్న ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. కానీ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాలా తీశారు. ఈయన కూడా ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడి హోదాను అనుభవించారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు తలకిందులయ్యాయి.

story of ambani brothers
ఒక కేసు విషయమై బ్రిటన్‌ కోర్టుకు అందించిన డాక్యుమెంట్లలో అనిల్ అంబానీ.. తన సంపద జీరో అని పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ‘నా ఇన్వెస్ట్‌మెంట్ల విలువ క్షీణించింది. నా అప్పులు పరిగణలోకి తీసుకుంటే నా సంపద విలువ జీరో. నా పేరు మీదు చెప్పుకోదగ్గ లేదా విక్రయించి సొమ్ము చేసుకోగల ఆస్తులు ఏమీ లేవు’ అని అనిల్ అంబానీ పేర్కొన్నారని వివరించింది.

story of ambani brothers
అనిల్ అంబానీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నదమ్ములు ఇద్దరూ ఒకే చోటు నుంచి ప్రయాణాన్ని ప్రారంభించారు. కాలం గడిచేకొద్ది అన్న అందనంత ఎత్తుకు వెళ్లగా.. తమ్ముడేమో పాతాళానికి చేరుకున్నాడు. ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ 2005 తండ్రి ఆస్తులను సమంగా పంచుకున్న విషయం తెలిసిందే. 2007 అంటే కుటుంబం విడిపోయి రెండేళ్లు గడిచిన తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంపద విలువలో అతిస్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉండేది.

story of ambani brothers
ఫోర్ట్స్ 2007 ధనవంతుల జాబితాలను గమనిస్తే.. అనిల్ అంబానీ సంపద 45 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ సంపద విలువ 49 బిలియన్ డాలర్లు. సంపద విలువ పరంగా 2006లో అనిల్ అంబానీ అన్నను మించిపోయారు కూడా. దేశంలోని అత్యంత ధనవంతుల్లో అప్పుడు లక్ష్మీ మిట్టల్, అజీమ్ ప్రేమ్‌జీ తర్వాత మూడో స్థానంలో ఉన్నారు. అప్పట్లో అనిల్ అంబానీ దగ్గర అన్న కన్నా రూ.550 కోట్ల సందప ఎక్కువగా ఉండేది.

12 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడేమో అన్నదమ్ముల సంపద పూర్తి వ్యతిరేక దిశల్లో ఉంది. పోర్బ్స్ రియల్‌టైమ్ నెట్‌వర్త్ ప్రకారం 2019 మార్చిలో అనిల్ అంబానీ సంపద విలువ 1.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13,110 కోట్లు). 2007తో పోలిస్తే ఏకంగా 90 శాతం సంపద హరించుకుపోయింది. అదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద 54 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.3,72,600 కోట్లు) ఉంది. 2007తో పోలిస్తే సంపద 10 శాతం పెరిగింది. గతేడాది అనిల్ అంబానీ బిలియనీర్ల జాబితాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

story of ambani brothers
ముకేశ్ అంబానీ గత 12 ఏళ్ల కాలంలో రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో వంటి కొత్త కొత్త వెంచర్లతో దూసుకెళ్లారు. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్‌ను మరింత విస్తరించారు. అదేసమయంలో అనిల్ అంబానీ తన సంపదను కోల్పోతూ వచ్చారు. టెలికం వ్యాపారం దెబ్బతింది. తెలియని వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ వ్యాపారాల్లోకి ప్రవేశించారు. దీంతో అప్పులపాలయ్యారు.

story of ambani brothers
దూరదృష్టి, పట్టుదల అనే అంశాలు ముకేశ్ అంబానీని ఏ వ్యాపారంలోనైనా లీడర్‌గా నిలిపాయి. అనిల్ అంబానీ వేగంగా రాబడులను అందించే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. అనిల్ చివరకు కుటుంబం నుంచి సంక్రమించిన టెలికం వ్యాపారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు.

ambani 2

2002లో ముకేశ్ అంబానీయే టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆస్తుల పంపకంలో ఇది తమ్ముడికి వెళ్లింది. అయితేనేం ఆర్‌కామ్ ప్రారంభమైన దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ రిలయన్స్ జియోను ఏర్పాటు చేశారు ముకేశ్ అంబానీ. దీన్ని కేవలం మూడేళ్ల కాలంలోనే టాప్ 3 టెలికం సంస్థల్లో ఒకటిగా నిలిపారు.

ముకేశ్ అంబానీ ఏ వ్యాపారాన్ని అయినా దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలతో ముందుకెళ్తారు. క్షేత్ర స్థాయిలో కంపెనీ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు అనిల్ అంబానీకి అబ్బలేదు. దీంతో కొత్తగా సంపాదన విషయాన్ని పక్కన ఉంచితే ఉన్న డబ్బునే నిలుపుకోలేకపోయారు. కానీ కష్ట కాలాల్లో తమ్ముడిని ఆదుకుంటూనే ఉన్నాడు ముఖేష్‌ అంబానీ. కష్ట సమయాల్లో అండగా నిలిచినందుకు అ‍న్నకు, వదినకు కృతజ్ఞతలు చెప్పాడు అనిల్‌ అంబానీ.


End of Article

You may also like