హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, అరుంధతి మూవీతో హిట్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Video Advertisement

అనుష్క టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అయితే భాగమతి సినిమా తరువాత సైలెంట్ అయ్యింది. చాలా కాలం తరువాత అనుష్క నటించిన మూవీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ ప్రమోషన్స్ అనుష్క దూరంగా ఉండడానికి కారణం ఇదే అంటూ ఒక వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అనుష్క ఎన్నో హిట్ సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా రాణించారు.  నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించి, మెప్పించింది. టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పేరు గాంచింది.  కన్నడ అమ్మాయి అయినా, తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ అభిమానాన్ని పొందింది. అరుంధతి మూవీతో మహిళా ఆడియెన్స్ ఆకట్టుకున్న అనుష్క బాహుబలి మూవీలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్  సంపాదించుకుంది.బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి చిత్రాలే చేస్తుంది అనుకున్నారు. ఆ తరువాత భాగమతి మూవీ చేసింది. ఆ మూవీ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క సైలెంట్ అయ్యింది. చాలా కాలం తరువాత సి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.  మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కానీ అనుష్క మాత్రం  ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.
దానికి కారణం అనుష్క సైజ్ జీరో మూవీ  కోసం బరువు పెరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె అదే ఫిజిక్ కొనసగిస్తున్నారని అంటున్నారు.  ఇక ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో కూడా అనుష్క బొద్దుగానే ఉంది. అందువల్లే అనుష్క మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదని ఇండస్ట్రీలో టాక్.

Also Read: “నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో సార్లు చూసి ఉంటారు… కానీ ఈ పొరపాటు గమనించారా..?