Ads
హిందూ సంప్రదాయం ప్రకారం, ఎవరైన మరణించినపుడు వారి దహన సంస్కారాల జరిగేటప్పుడు స్మశాన వాటికకి స్త్రీ లను అనుమతించరు. ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా అంత్యక్రియలకు, స్మశాన వాటికకి వెళ్తున్నారు. కానీ హిందూ మతం ప్రకారం వాటికి స్త్రీలకి ప్రవేశం లేదు.
Video Advertisement
సొంతవారు లేదా బంధువులు ఇలా ఎవరు మరణించినా చివరి చూపు చూడడానికి స్త్రీలకు స్మశానవాటికలోకి అనుమతి లేదు. అంతేకాకుండా దహన సంస్కారాలు స్త్రీలు నిర్వహించడం కూడా నిషేధించారు. మరీ వాటి వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్త్రీలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి, శ్మశాన వాటికకు వెళ్ళకుండా నిషేధించడం చాలామంది పురాణాల ఆధారంగా అధ్యయనం చేశారు. మహాభారత కాలంలో స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనేవారని తెలుస్తోంది. భీష్ముడి దహన సంస్కారాల సమయంలో కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొన్నట్లు కనుగొన్నారు. పూర్వ కాలంలో మరణానికి, స్వర్గానికి కుమారుడు వారధి అని భావించేవారు. మరణించినవారికి అంత్యక్రియలు మరియు చితికి నిప్పు పెట్టడం వంటి ప్రక్రియ కుమారుడు చేస్తే ఆ వ్యక్తులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసించేవారు.
అందువల్ల కుమారుడు లేదంటే కుమారుడితో సమానమైనవారితో దహన సంస్కారాలు చేయించేవారు. పూర్వ కాలంలో స్త్రీలు చాలా సున్నితమైన వారు అని, త్వరగా భావోద్వేగానికి లోనవుతారని అనుకునేవాళ్ళు. అందువల్ల దహన సంస్కారాలను స్త్రీలు చూసి తట్టుకోలేరని, వాళ్లను అంత్యక్రియలకు దూరంగా ఉంచేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలను స్మశాన వాటికకి రాకూడదు అనడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే,
పూర్వకాలంలో అంత్యక్రియలు చేసేటపుడు, ఇంట్లో ఉండే వృద్దులను, పిల్లలను చూడడం కోసం. వచ్చినవారందరికి భోజన ఏర్పాట్లు చేయడం కోసం స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. పురుషులు మాత్రమే స్మశానంకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఇక అంత్యక్రియలు చేసేటపుడు స్మశానంలో దుష్టశక్తులు కూడా ఉంటాయట. స్త్రీలు సున్నితంగా ఉండడం వల్ల వాళ్లను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉందని, మహిళలను స్మశాన వాటికలోకి నిషేధించారట. దహన సంస్కారాలకు వెళ్ళిన స్త్రీలు తమ వెంట్రుకలను తీసివేయాలట. ఆ కారణంగా కూడా స్త్రీలను నిషేధించారని తెలుస్తోంది.
Also Read: మరణించిన వారి అస్థికలను “గంగా నది” లో ఎందుకు కలుపుతారో తెలుసా?
End of Article