సామాజిక మాధ్యమాలలో వర్మ హంగామా మాములుగా ఉండదు. పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ తెచ్చుకోవడం లో వర్మ కి ఎవ్వరూ సాటిరారు. ప్రతిరోజు ఏదో ఒక విషయం లో ఆయన వైరల్ అవుతూనే ఉంటారు. మొన్నామధ్య బోల్డ్ ఇంటర్వ్యూ పేరుతో అరియానా ను తీసుకొచ్చి వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా.. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ.. ఈసారి అషురెడ్డి ని తీసుకొచ్చారు వర్మ.

ashureddy

అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసారు. తాజాగా.. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో లో అషు రెడ్డి రామ్ గోపాల్ వర్మ చంప పై కొట్టారు. బోల్డ్ ఇంటర్వ్యూ అంటేనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం. మరి చంప మీద చెయ్యి చేసుకునేదాకా ఎందుకు వెళ్లిందో చూడాలి. సెప్టెంబర్ 7 వ తేదీన ఫుల్ ఇంటర్వ్యూ విడుదల అవ్వబోతోంది. ఇంతకీ అషు రెడ్డి వర్మ ను ఎందుకు కొట్టారో తెలియాలంటే సెప్టెంబర్ 7 వ తేదీ వరకు ఆగాల్సిందే.