“రామ్ లల్లా” అంటే అర్థం ఏంటి.? అయోధ్య రాముడిని ఎందుకలా అంటారు.?

“రామ్ లల్లా” అంటే అర్థం ఏంటి.? అయోధ్య రాముడిని ఎందుకలా అంటారు.?

by Mounika Singaluri

తులసీదాస్ చేత రచించబడిన రామ్ చరిత మానస లో బాల రాముడుని రామ్ లల్లా అని వర్ణించారు. ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. అయోధ్యలో రామ మందిరం జనవరి 22, 2024న ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు.ఇందులో బాల రాముడి ని ప్రతిష్టింస్తున్నారు.

Video Advertisement

దీనికోసం ముగ్గురు వేరు వేరు కళాకారుల దగ్గర బాల రాముడి విగ్రహాన్ని తయారు చేపించారు. అందులో కర్ణాటక కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే ఒక కళాకారుడు చేసిన బాల రాముడి విగ్రహం ఎంపిక అయింది. ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. దీన్ని రామ్ లల్లా అని పిలుస్తారు.అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నపిల్లలని చిన్ను, బుజ్జి, చిట్టి, కన్నా అని ఎలాగైతే ప్రేమతో పిలుస్తామో అలాగే అప్పట్లో అయోధ్యలో చిన్న పిల్లలని లల్లా అని పిలిచేవారట.

ఐదు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న రాముడ్ని రామ్ లల్లా అని అప్పట్లో వాళ్ళు పిలిచేవారట. దాన్నే తులసీదాస్ తన రామ్ చరిత మానస్ లో వర్ణించారు. అందుకే అయోధ్య రాముడ్ని రామ్ లల్లా అనే పేరుతో పిలవబోతున్నారు.ఇది ఇలా ఉండగా జనవరి 22న అయోధ్యలో అతి ఘనంగా రామ మందిరంలో రాముని ప్రతిష్టాపన జరగనుంది.

దీనికోసం ప్రధానమంత్రి మోడీతో సహా పలు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ప్రభాస్, అల్లు అర్జున్, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ మొదలైన వాళ్ళందరూ హాజరు కాబోతున్నారు. నరేంద్ర మోడీ తన చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఈ రామ మందిరం ఎట్టకేలకు పూర్తి అయ్యి ప్రతిష్టాపన దశలోకి వచ్చింది. భారతదేశమంతా జనవరి 22న ఒక పండుగలా చేసుకుంటారు.ఆ తేదీ భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది.


You may also like

Leave a Comment