మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ కి శ్రీకృష్ణదేవరాయలంటే అంత భయమెందుకు..? విజయనగరంపై అందుకే కన్నేయలేదు.!

మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ కి శ్రీకృష్ణదేవరాయలంటే అంత భయమెందుకు..? విజయనగరంపై అందుకే కన్నేయలేదు.!

by Harika

Ads

శ్రీ కృష్ణ దేవ రాయలు.. తెలుగు వారి మర్చిపోలేని చక్రవర్తి. తెలుగు భాష గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన వ్యక్తి. అలాంటి శ్రీ కృష్ణ దేవ రాయలంటే మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ భయపడేవారట. మొగల్ చక్రవర్తి బాబర్ కి కూడా చాలా బలగం ఉండేది. అత్యంత బలమైన సైన్యం ఉండేది. అయినా, శ్రీ కృష్ణ దేవ రాయల విషయం లో మాత్రం భయపడేవాడట. ఎందుకో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

Video Advertisement

శ్రీ కృష్ణ దేవరాయలు విజయ నగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందే. రాయల వారి హయాం లో విజయనగర సామ్రాజ్యం ఎక్కువ గా అభివృద్ధి చెందింది. నేటికీ ప్రజలు రాయల వారి కాలాన్ని తలుచుకుంటూనే ఉంటారు. అప్పట్లో వస్తువుల కొనుగోలు విధానం ఉండేది కాదట. కేవలం వస్తు మార్పిడి పధ్ధతి మాత్రమే ఉండేదట. అందుకే ఆ కాలం లో రాజ్యం సుభిక్షం గా ఉండేది. ఆ రోజుల్లో శ్రీకృష్ణ దేవ రాయల బలగం కూడా చాలా ఎక్కువ గానే ఉండేది. దాదాపు యాభై వేల మంది వీర సైనికుల సైన్యం ఉండేది. పోర్చుగీసు సైనికులు అయితే ఫిరంగులు కూడా కాల్చేవారు. 600గజ దళం, 3200 అశ్వ దళం ఉండేవి. దక్షిణ ఆసియా మొత్తం లో రాయల వారి సైన్యం అత్యంత బలమైనది గా పేరు పొందింది.

srikrishna devaraya

అప్పట్లో అధిక సైన్య బలం ఉన్న బిజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ను కూడా రాయలు ఓడించగలిగారు. ఆదిల్ షా కు ఉన్న బలగం తక్కువేమి కాదు.. ఆరోజుల్లోనే 900కు పైగా ఫిరంగుల సామర్ధ్యాన్ని బీజాపూర్ సుల్తాన్ సైన్యం కలిగి ఉంది. అంతటి భారీ సైన్యాన్ని సైతం రాయలు ఓడించగలిగారు. బాబర్ కు మాత్రం యాభై వేల సైనిక బలం తో పాటు మరో యాభై ఫిరంగుల సామర్ధ్యం ఉంది.

babar

ఒకవేళ బాబరు రాయలు తో పోటీ పడ్డప్పటికీ, బాబరు కచ్చితం గా ఓటమి పాలయ్యేవాడు. అందుకే బాబరు రాయలు జోలికి పోలేదని చెబుతుంటారు. డెక్కన్ సామ్రాజ్యాన్ని రాయల వారి వంశస్తులు 250 సంవత్సరాలకంటే ఎక్కువ పరిపాలించారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే, రాయల వారికి ఉన్న ధైర్య సాహసాలు మరో రాజు కు లేవు.. అందుకే రాయలు మకుటం లేని మహారాజు గా పాలన చేసారు.


End of Article

You may also like