Ads
ఉదయం మధ్యాహ్నం రాత్రి కాకుండా వేరే సమయాల్లో ఆకలేసినప్పుడు మనం ఎక్కువగా తినడానికి ఇష్టపడేది బిస్కెట్స్. ఇవి ఎంతో తేలికగా కడుపు నిండేలా ఉంటాయి. కాబట్టి ప్రయాణ సమయాల్లో కూడా జనాలు ఎక్కువగా బిస్కెట్లు తింటారు. బిస్కెట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. చాలామంది ఇష్టపడేవి మాత్రం క్రీమ్ బిస్కెట్లే.బోర్బొన్ బిస్కెట్లు చాలామందికి తెలిసే ఉంటాయి. ఇది ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇంకా సేల్స్ అలానే నడవడానికి కారణం వాటి రుచి. మరీ తియ్యగా మరీ చేదుగా కాకుండా ఒక మోస్తరు రుచి లో ఉంటాయి.
Video Advertisement
ఈ బిస్కెట్ లో క్రీం తింటే దాదాపు చాక్లెట్ తిన్నట్టు గానే అనిపిస్తుంది. ఇలాంటి రుచి వేరే ఏ బిస్కెట్ కి రాదు.తల్చుకుంటేనే నోరూరుతుంది కదా. వాటికున్న ప్రత్యేకత అలాంటిది మరి. మీరెప్పుడైనా ఈ బిస్కెట్ ని గమనిస్తే మధ్య మధ్యలో రంధ్రాలు ఉంటాయి. గమనించే ఉంటాం కానీ వాటిని తినే ధ్యాసలో ఉండి అవి ఎందుకు అన్న విషయాన్ని పట్టించుకోము. కానీ ఇలా రంధ్రాలు ఉండడం వెనుక కూడా ఒక కారణం ఉంది తెలుసా?
ఈ బిస్కెట్లను తయారు చేసే సంస్థ మెక్ విటీస్. దాని బ్రాంచ్ ఒకటి కార్లీసిల్ లో ఉంది. అందులోని టీం మేనేజర్ మార్క్ గ్రీన్వేల్ ఆ కారణం గురించి ఈ విధంగా చెప్పారు. “బిస్కెట్లు తయారు చేసేటప్పుడు అవి వేడిగా ఉంటాయి. ఒకవేళ అలానే తయారు చేసి ప్యాకింగ్ చేసేస్తే లోపల ఉన్న వేడి ఆవిరిగా మారి క్రీం కరిగిపోవడం, బిస్కెట్లు మెత్తబడి పోవడం, విరిగిపోవడం లాంటివి అవుతాయి.అందుకే ఆ రంధ్రాలు వల్ల గాలి బయటికి వెళ్ళి పోయి బిస్కెట్లు మామూలుగా ఉంటాయి” అని చెప్పారు.
అలా ఒక్కొక్క బిస్కెట్ కి 10 రంధ్రాలు ఉంటాయి. ఈ సంస్థ తయారు చేసే జింజర్ బిస్కెట్లు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి పగుళ్లు పడిపోయి సులభంగా విరిగి పోయేలా ఉంటాయి. దానికి కారణం ఏమిటో ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును. రంధ్రాలు లేకపోవడం వల్ల ఆ వేడి అలాగే ఉండిపోయి దాని వల్ల పగుళ్లు వచ్చి జింజర్ బిస్కెట్లు అలా ఉంటాయి. ఇవి చూడడానికి బోర్బొన్ కి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ దేని ప్రత్యేకత దానిదే దేని రుచి దానికే ఉంటుంది.
End of Article