Ads
చాలామందికి బ్లడ్ ప్రెషర్ పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాతే ఎక్కువగా వస్తుంది దీనికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. పెళ్లికి ముందు జీవితం పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పెళ్ళికి ముందు జీవితంలో ఎలాంటి టెన్షన్, బాధ్యతలు ఉండవు కానీ పెళ్లి తర్వాత బాధ్యతలు టెన్షన్స్ అన్నీ పెరుగుతాయి. పెళ్లి తరువాతే చాలామంది జంటల్లో బీపీ పెరుగుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.
Video Advertisement
దంపతులిద్దరిలో ఒకరికి బీపీ వస్తే చాలా కొద్ది రోజుల తేడాలోనే మరొకరికి కూడా బీపీ వస్తుంది. కుటుంబం కోసం ఆ దంపతులు పడే తపన, యాతన, కలిసి నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళిద్దరూ పడే ఘర్షణ ఇవి అన్ని బీపీకి కారణం అవుతాయి. ఒక్కొక్కసారి తీవ్ర ఒత్తిడి వల్ల బీపీ ఎక్కువ అయి ప్రాణాలకు సైతం ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఉప్పు, కారాలు ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోండి.
యోగా మెడిటేషన్ వంటివి చేయటం వలన బీపీ చాలా కంట్రోల్ లో ఉంటుంది అలాగే సమస్యలను వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోండి. సమస్యలను ఒత్తిడిగా ఫీల్ అయినట్లయితే అది మీ బీపీ మీద ప్రభావం చూపిస్తుంది. బీపీ ఎక్కువైనట్లయితే అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పై ఎక్కువగా శ్రద్ధ చూపించండి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించే ప్రయత్నం చేయండి.
రోజుకి అరగంట వ్యాయామం చేయండి రోజు వ్యాయామం చేయడం వలన రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు సోడియం రిచ్ ఫుడ్స్ కంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే కచ్చితంగా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవటం చాలా అవసరం. చిన్ని చిన్ని జాగ్రత్తలతో బీపీని కంట్రోల్ లో ఉంచుకుంటే ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది.
End of Article