బ్రహ్మ దేవుడు నిజంగానే తన కూతుర్ని పెళ్లి చేసుకున్నారా.?

బ్రహ్మ దేవుడు నిజంగానే తన కూతుర్ని పెళ్లి చేసుకున్నారా.?

by Megha Varna

Ads

Article sourced from: a youtube channel Nanduri Srinivas – Spiritual Talks

Video Advertisement

సామాజిక మాధ్యమాలలో ఎన్నో ఫేక్ వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే అటువంటి వార్తలను అందరూ షేర్ చేస్తూ ఉంటారు.పురాణాలకు సంబంధించి కూడా అందరికీ ఎన్నో అపోహలు ఉంటాయి. మరి ఏది నిజమో తెలియకుండానే ఉంటారు.

అటువంటి విషయాల్లో ఒక ప్రధానమైన ప్రశ్నకు జవాబు దొరకలేదు. బ్రహ్మ తన కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఓ లుక్ వేసేయండి.

బ్రహ్మ పురాణం ప్రకారం ఒక కథలో బ్రహ్మ ఒక రోజు కళ్ళు మూసుకొని సాత్విక రూపం లో ఉండగా శరీర భాగాల నుండి కొంత మంది దేవతలు పుట్టుకొచ్చారు. అయితే ముఖ భాగం నుండి సరస్వతి దేవి పుట్టింది. నేను ఏం చేయాలని బ్రహ్మని అడిగింది. ఈ విధంగా ఆయన సమాధానం ఇచ్చారు, మొదటగా జ్ఞానుల నాలుక పై కొలువుండమని, అటువంటి జ్ఞానులు మాట్లాడింది పరమ పవిత్రమైన వాక్కు కింద తీసుకురమ్మని చెప్పారు. రెండవది ఒక నది స్వరూపంలో ఉండి ప్రవహించమని అన్నారు. చివరగా నాకు భార్యగా ఉండి ఈ సృష్టి చేయడానికి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు.

అయితే మత్స్య పురాణం ప్రకారం సరస్వతీ దేవి బ్రహ్మకు భార్యగా ఉండడానికి అంగీకరించలేదు. కానీ బ్రహ్మ విడిచిపెట్టకపోవడంతో వంద సంవత్సరాలు కలిసే ఉండటానికి అంగీకరించి వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత మనువు, శతరూప వాళ్ళందరూ పుట్టారని మత్స్య పురాణం తెలుపుతుంది.

Do You Know Lord Brahma Married His Own Daughter Goddess Saraswati | All India Daily

మనుషులుది మాంస శరీరం మరియు దేవతలది మంత్ర శరీరం ఈ రెంటికీ చాలా తేడా ఉంటుంది. దేవతలకు ఉండే మంత్ర శక్తులు ద్వారా ఎన్నో సాధించగలుగుతారు పైగా అవి ఎవరికీ సాధ్యం కావు. అదేవిధంగా మనుషుల్లో ఉండే బంధాలు దేవతల మధ్య ఉండవు. అక్కడ కొడుకు, కూతురు, బావ, బావమరిది వంటివి వర్తించవు. మన మధ్య ఉండే బంధాలను మరియు దేవతలు మధ్య ఉండే బంధాలను ముడిపెట్టడం సరికాదు.

watch video: 

https://youtu.be/yEs6llg36Fk


End of Article

You may also like