Ads
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన విషయం. ఎంతో మందిని చూసి, వారిలో వారికి నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని ఆనందంగా జరుపుకునే వేడుక ఇది. ఇది ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వారు జరుపుకుంటారు. కొంత మంది ఘనంగా జరుపుకుంటే, మరి కొంత మంది సింపుల్ గా చేసుకుంటారు.
Video Advertisement
పెళ్లయిపోతే అదేదో ఒక వరల్డ్ కప్ గెలిచినట్టు చాలా మంది అనుకుంటారు. కానీ అసలు సమస్యలు తర్వాతే మొదలవుతాయి. ఒకరిని ఒకరు అప్పుడే బాగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. దాని వల్ల కొంత మంది బంధం బలపడితే, మరి కొంత మందికి మాత్రం సమస్యలు వస్తాయి. గొడవలు అనేవి సహజం. కానీ అవి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒకరితో ఒకరు కలిసి ఉండలేక విడిపోతారు.
ఇలా విడిపోయే జంటలు ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే కనిపిస్తున్నారు. సాధారణ ప్రజలు విడిపోరు అని కాదు. కానీ సెలబ్రిటీలలో ఇలా పెళ్లి చేసుకొని విడిపోయే జంటల సంఖ్య పెరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది విడిపోయారు. బాలీవుడ్ లో చాలా మంది విడిపోయారు. హాలీవుడ్ లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్, ఈషా డియోల్- భారత్ తడాని ఇలా చాలా మంది ఇటీవల విడాకులు ప్రకటించారు. సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 ఆర్థిక స్వేచ్ఛ
సెలబ్రిటీలలో చాలా మంది ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కొంత మంది నటన రంగంలో ఉంటే, మరి కొంత మంది వ్యాపారంగంలో ఉంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. సాధారణమైన ప్రజలకి విడాకులు తీసుకోవాలి అంటే కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్లకి చాలా డబ్బులు చెల్లించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ సెలబ్రిటీల దగ్గర ఇలాంటి ఖర్చులు భరించే అంత డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్లు కలిసి ఉండలేక పోతే విడిపోతారు.
#2 నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం
ఆర్థిక స్వేచ్ఛ అనేది నిర్ణయాలు తీసుకోగలిగే ధైర్యం ఇస్తుంది. తర్వాత ఎలా ఉన్నా సరే తనని తాము సముదాయించుకోగలం అనే నమ్మకం ఉంటుంది. కొన్ని సార్లు అవతల వ్యక్తి అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా, కలిసి బతకడం కష్టం అంటే విడిపోవడమే నయం అని అనుకుంటారు. ఆ అనుకున్న పనిని ధైర్యంగా చేయగలుగుతారు.
#3 తల్లిదండ్రుల మద్దతు
సాధారణ కుటుంబాల్లో చాలా మందికి లేనిదే ఇది. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు. చాలా విషయాల్లో ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రుల మద్దతు లభించదు. ఇలాంటి విషయాల్లో అయితే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అంత ఖర్చు పెట్టి చేసిన పెళ్లి అంతా వృధా అయినట్టేనా? ఇలాంటి చాలా ఆలోచనలు వారి మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. కానీ సెలబ్రిటీలు అంటే ఇవన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు కాబట్టి, అంతే కాకుండా వారి పిల్లలు కూడా తమ సొంత కాళ్ళ మీద నిలబడిన వారు అయ్యి ఉంటారు కాబట్టి ఆ నమ్మకంతోనే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇస్తారు.
#4 అర్థం చేసుకోలేకపోవడం
అసలు డివోర్స్ వరకు వెళ్లడానికి ముఖ్యమైన కారణం ఇదే. సెలబ్రిటీలు అన్న తర్వాత వారికి ఉన్న పనుల వల్ల ఒకరితో ఒకరు సమయం గడపడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరు బాధపడినా కూడా మాట్లాడుకుని పరిష్కరించుకుని అంత సమయాలు వారికి ఉండవు. వారిలో కొంత మందికి తమ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి అని ఉంటుంది. కానీ పని వల్ల అది కుదరదు. కొన్ని సార్లు ఇదే విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకోవడం కష్టం. ఈ కారణంగానే విడిపోతారు.
#5 ఈగో
ఈగో వల్ల కేవలం భార్యాభర్తల బంధాలు మాత్రమే కాదు. ఏ బంధం అయినా విడిపోతుంది. తనకి తప్ప వేరే వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడం, తను మాట్లాడిందే కరెక్ట్ అనుకోవడం, అవతల వాళ్ళకి విలువ ఇవ్వకపోవడం, చులకనగా చూడడం ఇవి సాధారణ భార్యాభర్తల మధ్య కూడా జరుగుతూ ఉంటాయి. కానీ సెలబ్రిటీలకి వారు సంపాదించిన గుర్తింపు వల్ల ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి చిన్న విషయాన్ని కూడా పెద్ద అవమానంగా ఫీల్ అవుతారు. కొన్ని సార్లు ఆత్మాభిమానానికి విలువ ఇచ్చి విడిపోతారు.
ఇవన్నీ కేవలం సెలబ్రిటీలు ఎక్కువగా విడిపోవడానికి ఉండే సాధారణమైన కారణాలు మాత్రమే. లోతుగా పరిశీలిస్తే వీటివల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు చాలానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నప్పుడు అది వారిని అభిమానించే ప్రేక్షకుల మీద కూడా తెలియకుండానే ప్రభావం పడుతుంది. సొంత వాళ్లు ఎవరో విడిపోయినట్టు బాధపడతారు. కానీ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో అని అర్థం చేసుకొని వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తారు.
ALSO READ : ధోని భార్య ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆమె ఎంత సంపాదిస్తారంటే..?
End of Article