“జలుబు”కి ఇప్పటివరకు సరైన మందు ఎందుకు లేదు.? కారణం ఇదే.!

“జలుబు”కి ఇప్పటివరకు సరైన మందు ఎందుకు లేదు.? కారణం ఇదే.!

by Mohana Priya

Ads

ప్రపంచం ఎంతో ముందుకు వెళ్ళింది. టెక్నాలజీ ద్వారా ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నాం. ఎన్నో వ్యాధులకు కూడా మందులను కనుగొన్నారు. కానీ ఇప్పటివరకు జలుబుకి మాత్రం సరైన మందు రాలేదు. ఇందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు రైనో వైరస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 వైరస్ లు ఉంటాయి.Why cold does not have any medicine

Video Advertisement

అందుకే ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాల నుండి ఎన్నో ఫార్మా సంస్థలు జలుబుకి మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఒక్క సరైన మందు కూడా దొరకలేదు. జలుబుకి కారణమైన వైరస్ అనేది మన గొంతు భాగంలో చేరుకొని అక్కడి నుండి వ్యాపిస్తూ ఉంటుంది. అలా మన శరీరంలో జలుబు లక్షణాలు కనిపించినప్పుడు మన శరీరమే జలుబుకి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రయత్నిస్తుంది.Why cold does not have any medicine

సరైన మందు లేకపోయినా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జలుబు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు సాధారణ సమయం కంటే ఎక్కువ సేపు నిద్ర పోవాలి. నిద్రపోతున్న సమయంలో మన శరీరం ఇంకా బలంగా ఇన్ఫెక్షన్లతో పోరాడగలుగుతుంది. తక్కువ వ్యాయామం చేయాలి. పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ముక్కు, నోరు, కళ్ళని ఊరికే ముట్టుకోకూడదు.అంతే కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ కారణంగా మనలో ఉండే మ్యూకస్ అనేది పల్చబడిపోతుంది. తొందరగా బయటికి వచ్చేస్తుంది. ఇలా చేస్తే జలుబుని తొందరగా నివారించవచ్చు.


End of Article

You may also like