ఈ 2 సినిమాలు అంత పెద్ద “బ్లాక్‌బస్టర్ హిట్” అయినా… ఇప్పుడు ఇలా అయ్యింది ఏంటి..?

ఈ 2 సినిమాలు అంత పెద్ద “బ్లాక్‌బస్టర్ హిట్” అయినా… ఇప్పుడు ఇలా అయ్యింది ఏంటి..?

by Anudeep

Ads

‘ఊరందరిదీ ఒక దారి అయితే, ఉలిపిరి కట్టది మరో దారి’ అన్నట్టూ.. బయట ఒకటి జరుగుతుంటే.. సోషల్ మీడియాలో ఇంకొకటి చర్చిస్తారు. జరిగిపోయిన విషయాలను తవ్వి తీయడంలో, జరుగబోతున్న విషయాలను ఊహించి రాయడంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ కొంతమంది కాచుక్కుర్చుంటారు.

Video Advertisement

ఓ సినిమాను ఆకాశానికి ఎత్తడంలో, లేదంటే విపరీతమైన నెగిటివిటీ సృష్టించబడంలో సోషల్ మీడియా ఎప్పుడూ ముందుంటుంది. దీనికి మంచి ఉదాహరణ “ఆర్ఆర్ఆర్”. సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేయడంతో సినిమాకు ఫుల్‌ పాజిటివ్‌ బజ్‌ కనిపించింది. కానీ విడుదలైన తర్వాత కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు.

పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ అన్న చందాన ‘కేజీయఫ్‌ 2’ సినిమాను ఆకాశానికెత్తేశారు. మన తెలుగు రచయితలు ఆ స్థాయిలో రాయలేరు, మన వాళ్ళు ఆ రేంజ్ లో తీయలేరు అన్నట్లు కొంతమంది విమర్శడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ‘ఆర్ఆర్‌ఆర్‌’కి సోషల్‌ మీడియాలో ఇప్పుడొస్తున్న పాజిటివ్ టాక్… ‘కేజీయఫ్‌ 2’కి లేదనే చెప్పాలి. మొదట్లో ‘ఆర్‌ఆర్ఆర్‌” సినిమా మీద కోపాన్ని ‘కేజీయఫ్‌ 2’పై ప్రేమగా మలుచుకున్నారు కొంతమంది. ఓటీటీలో సినిమా చూడటానికి అదనంగా డబ్బులు కట్టాలి అని ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ టీమ్‌లు చెప్పినప్పుడు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.


ఈ నిర్ణయం పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వెంటనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ వెనకడుగు వేసింది. ‘కేజీయఫ్‌ 2’ మాత్రం డబ్బులు కడితేనే స్ట్రీమ్ అయింది. థియేటర్ వసూళ్ల విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (₹1127.65) ₹ను ‘కేజీయఫ్‌ 2’ (₹1129.38) ఎప్పుడో దాటేసింది కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’దే ఇప్పటికీ పై చేయి. ఇటీవల సోషల్‌ మీడియాలో, రేటింగ్స్‌ వెబ్‌సైట్స్‌లో, విదేశాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవానే కనిపిస్తోంది. రోటెన్‌ టమోటాస్‌ టాప్‌ మూవీస్‌ 2022 లిస్ట్‌లో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దాటేసింది.

అలాగే ఇటీవల ‘ఆర్ఆర్‌ఆర్‌ ఎన్‌కోర్‌’ పేరుతో ఓవర్సీస్‌లో సినిమా రీ రిలీజ్‌ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో హాలీవుడ్‌ మరియు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా సినిమాను పొగుడుతున్నారు. ‘కేజీయఫ్‌ 2’ విషయంలో మాత్రం ఈ స్థాయి ప్రశంసలు కరువయ్యాయనే చెప్పవచ్చు. థియేటర్‌లో ‘కేజీయఫ్‌ 2’ సత్తా చాటినా.. బయట మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’దే హవా అని అర్థం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌, జీ5 ఓటీటీలలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్ట్రీమ్‌ అవుతుండటంతో ఫుల్‌ స్వింగ్‌లో సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా సినిమాకు కొత్త బజ్‌ తీసుకురావడానికి కారణంగా చెప్పొచ్చు.


End of Article

You may also like