సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన రోజు నుంచి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన పెళ్లిళ్లు, పిల్లలు, ఆస్తులు అంటూ రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలో కృష్ణకు సంబంధించిన ఇంకొక అంశం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Video Advertisement

కృష్ణ తన కన్న కొడుకుని సైతం కాదు అనుకొని సవతి కొడుకు నరేష్ తో ఉన్నాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ విజయ నిర్మల మొదటి భర్త సంతానం. ఆయనకు కృష్ణకి ఎటువంటి రక్తసంబంధం లేకపోయినప్పటికీ విజయ నిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ నరేష్ దగ్గరే ఉన్నాడు. దీని మీద ప్రస్తుతం నెట్ లో ఎన్నో కామెంట్లు వస్తున్నాయి.

mahesh babu thinking of building a memorial for super star krishna.

కానీ ఒకసారి ” ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” లో పాల్గొన్న కృష్ణ ఈ విషయంపై అప్పట్లోనే స్పష్టతని ఇచ్చారు. నరేష్ అంటే తనకు చాలా ఇష్టమని, తనకు ఎటువంటి అవసరం వచ్చిన క్షణాల మీద చేసి పెట్టేది కేవలం నరేష్ అని ఆయన అన్నారు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫోన్ చేయగానే పరిగెత్తుకు వస్తాడని కృష్ణ చెప్పారు.

ఇటు సూపర్ స్టార్ అయిన తర్వాత మహేష్ బాగా బిజీగా ఉన్నాడని. అతనికి సంబంధించిన అన్ని పనులు అతని భార్య నమ్రత దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని. అటువంటి సందర్భంలో తాను కూడా ఆమెకు భారంగా ఉండలేక పోయాడని . అందుకే విజయనిర్మల కాలం చేసినా నరేష్ మాత్రం కృష్ణ బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

naresh and pavitra lokesh acted as brother and sister in ramarao on duty movie

మరి నరేష్ విషయానికి వస్తే అతని పేరును ఇటు తల్లి పేరు అటు సవతి తండ్రి అయిన కృష్ణ పేరును జత చేసుకొని నరేష్ విజయ కృష్ణగా మార్చుకున్నాడు. మహేష్ బాబు మీద ఉన్న ఇష్టం కొద్దీ చాలామంది ఈ విషయంలో నరేష్ ను విమర్శిస్తారు. కానీ నరేష్ ఎప్పుడు కృష్ణను ఎంతో గౌరవంతో ,అభిమానంతో తండ్రి లాగా చూసుకున్నాడు. తన తల్లి చనిపోయిన తరువాత కృష్ణ కు తన తల్లి లేని లోటు తెలియకూడదని ఆయన ఎంతో ఆరాటపడ్డాడు.