కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లియో. ఈ మూవీ ఆడియో మరియు  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 30న గ్రాండ్ గా  చెన్నైలో ప్లాన్ చేశారు. అయితే ఈవెంట్ ను  హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం విజయ్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.

Video Advertisement

అయితే ఈవెంట్ ను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సివచ్చిందనే విషయం పై లియో నిర్మాణ సంస్థ ఇచ్చిన వివరణ పై  సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభం అయ్యింది. మరో వైపు ఈ చిత్రాన్ని కేరళలో బ్యాన్ చేశారని తెలుస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న చిత్రాలలో లియో ఒకటి. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాన్సిల్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లియో యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ, ఈవెంట్ పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోతున్నట్టు, ఆడియెన్స్ ఎక్కువగా వస్తారనే అంచనతో కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందువల్లే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అందరూ ఊహిస్తున్నట్టుగా మా పై ఏ పార్టీ ఒత్తిడీ లేదు.  అని వివరణ ఇచ్చింది. ఈ  వివరణ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలైపోయింది. ఈ రిజన్స్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడం లేదు. ఈవెంట్ సడెన్ గా క్యాన్సిల్ కావడంతో  పలు సందేహాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ కు లియో పంపిణి రైట్స్  ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా పర్మిషన్స్ రాకుండా చేశారని టాక్. ప్రతీ మూవీలోషేర్, లేదా ప్రధానమైన  ఏరియా రైట్స్ ను అడుగుతున్నారట. తమ కంపెనీకి రైట్స్ ఇవ్వని చిత్రాలను ఏదో విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హైప్ ఉన్న ‘లియో’ మూవీకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
రిలీజ్ కు ముందే కేరళ వాసులు, ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ ‘ లియో ‘ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘జిల్లా’ మూవీలో విజయ్‌ దళపతి, మోహన్‌లాల్‌ కలిసి నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మూవీలో మోహన్‌లాల్ యాక్టింగ్ ను కొందరు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్‌ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విజయ్ ‘లియో’ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని మోహన్ లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి, మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగారు.

Also Read: ప్లీజ్… ఇదంతా ఇంక ఆపేసేయండి..! చాలా ఎక్కువ అయ్యింది..!