అంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” అంత ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయ్యింది..? కారణం ఇదేనా..?

అంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” అంత ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయ్యింది..? కారణం ఇదేనా..?

by kavitha

Ads

టాటా అనే పేరు తెలియని ఇండియన్ ఉండరని చెప్పవచ్చు. టీ నుండి ట్రక్స్ వరకు, ఉప్పు నుండి ఉక్కు వరకు ప్రతి వ్యాపారంలో టాటా పేరు వినిపిస్తుంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ  సామ్రాజ్యంగా నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.

Video Advertisement

రతన్ టాటా మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందిని తొలగించడం కోసం చేసిన సరికొత్త ప్రయత్నం టాటా నానో కార్. ఈ కార్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. భారత దేశంలో మధ్య తరగతి ప్రజలు స్కూటర్ల మీద ఎక్కువగా ప్రయాణిస్తారు. ఒక బైక్ మీద ఫ్యామిలీ మొత్తం నలుగురు, ఐదుగురు వెళ్తుంటారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో పిల్లలు నలిగిపోతుంటారు. ఇలాంటి ప్రయాణం గుంతల రోడ్డు పై చాలా ప్రమాదకరం. ఇక ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిన రతన్ టాటా బాధపడి మధ్యతరగతి ప్రజల కోసం, వారి భద్రత గురించి ఆలోచించి ఏదైనా తయారుచేయాలని అనుకున్నారు. అలా ఆయన ఆలోచనల నుండి వచ్చిందే టాటా నానో కారు. ప్రజల కారుగా పేరుగాంచింది.
నానో కారు ఖరీదు లక్ష రూపాయలు మాత్రమే. సామాన్యు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కార్ ను తయారు చేశారు. రతన్ టాటా ఈ కార్ ను ప్రకటించినపుడు ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలు, మీడియా  ఈ కార్ కోసం ఎదురు చూశారు. ఈ కార్ కి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ ఈ కార్ ఫెయిల్ అయ్యింది. దీని సక్సెస్ కోసం రతన్ టాటా ఎంతో కష్టపడ్డారు. అయితే లక్ష రూపాయలతో కార్ తయారు చేయడం అనేది అతి పెద్ద టాస్క్. ఇది ప్రాక్టికల్ గా అసాధ్యం కూడా. అప్పటి సీఈఓ సైరస్ మిస్త్రీ కూడా టాటా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
అయినా టాటా కంపెనీలోని యంగ్ ఇంజనీర్స్ తో ఈ కార్ ను డిజైన్  చేయించారు. ఎంత ప్రయత్నించిన లక్ష రూపాయలలో కార్ తయారుకాలేదు. దాంతో టాటామోటార్స్ జనాలకి ప్రామిస్ చేశాం కాబట్టి నానోలోని బేస్ మోడల్‌ కు  మాత్రమే లక్ష రూపాయలు ఫిక్స్ చేసి, మిగతా మోడల్స్ కి 2.5 లక్షల వరకు పెట్టారు. ఇక లక్ష రూపాయలలో వచ్చే బేస్ మోడల్‌ కార్ కు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏసీ కానీ, సేఫ్టీ రేటింగ్ లాంటివి ఏమి ఉండవు. అందువల్ల నానో కార్ ఆక్సిడెంట్స్ ను కాపాడలేదు. ప్రామిస్ చేశారు కాబట్టి కుదించి లక్ష రూపాయలలో తయారుచేశారు.
సాధారణంగా కారులో ప్రయాణించేప్పుడు సేఫ్ గా భావిస్తారు. కానీ నానో విషయంలో సేఫ్ గా భావించలేము. అలాంటి కారు ఎప్పటికీ విజయవంతం కాలేదు. నానో ఫెయిల్ అవడానికి ఇది ఒక కారణం. అయితే ఈ కార్ తయారీ వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం ద్విచక్రవాహనం పై నలుగురు, కారులో అయితే ఎండ తగలకుండా, వర్షంలోను ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే రతన్ టాటా కారు తయారు చేయించి, మార్కెట్ లోకి విడుదల కూడా చేశారు. అయితే ఆ ఉద్దేశ్యాన్నిమార్కెటింగ్ టీమ్ ప్రజలలోకి సరైన విధంగా తీసుకెళ్ళలేకపోయింది.
మార్కెటింగ్ టీమ్ నానో కారును కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తే సరిపోతుందని భావించి చిపెస్ట్ కారుగా మార్కెట్‌లోకి తెచ్చారు. ఈ వ్యూహం కారణంగా దీర్ఘకాలంలో ఈ కారు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ప్రజలు పేదరికానికి చిహ్నంగా ఈ కారును పరిగణించడం మొదలుపెట్టారు. ఈ ట్యాగ్ ను ఎవరు ఇష్టపడలేరు. ఈ కారు విఫలం కావడానికి కారణం ప్రమోషన్ మరియు పొజిషనింగ్ అని చెప్పవచ్చు.
టాటా మోటార్స్ ఏడాదికి 2,50,000 నానో కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ప్రారంభ అమ్మకాలు 30,000 (సుమారుగా) మాత్రమే. 2011-12లో అత్యధికంగా 74,527 అమ్మకాలు జరిగాయి. ఇది 2016-17లో 7,591కి పడిపోయింది. జూన్ 2018లో ప్లాంట్ 1 నానో అమ్మకం మాత్రమే జరిగింది. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు.

Also Read: వేసవిలో బైక్ “ఫుల్ ట్యాంక్” కొట్టించడం వలన ఇంత పెద్ద ప్రమాదం ఉందా..??


End of Article

You may also like