Ads
వేదాలలో ఉండే రహస్యాలని ఒక రోజు పరమ శివుడు పార్వతీ దేవికి చెబుతున్నాడు. అయితే ఆ సమయంలో పార్వతి దేవి ఏకాగ్రతని కోల్పోతుంది. దీనితో పరమ శివుడు పార్వతి దేవిని శపిస్తాడు. తను ఒక మత్స్యకారుడి ఇంట్లో పుట్టాలని పరమ శివుడు పార్వతీ దేవిని శపించడం జరుగుతుంది.
Video Advertisement
దీనితో పార్వతీ దేవి కైలాసం నుండి మాయమై పోయి ఒక మత్స్యకారుడి ఇంట్లో పుడుతుంది. పార్వతి దేవి మత్స్యకారుడు ఇంట్లో ఒక అందమైన అమ్మాయిలా పెరుగుతుంది.
తన తండ్రి చేపలు పడుతూ ఉంటాడు. అతనికి పార్వతీ దేవి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇలా చాలా ఏళ్ళు గడిచి పోతూ ఉంటాయి. తర్వాత శివుడు ఇంక ఆ దూరాన్ని తట్టుకో లేక ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అయితే ఎలా అయినా సరే నంది సహాయంతో పార్వతి దేవిని తిరిగి కైలాసానికి తీసుకు రావాలని అనుకుంటాడు.
పరమ శివుడు ఆదేశించిన ప్రకారం నంది సొర చేపని తీసుకుని పార్వతి దేవి కుటుంబం ఉండే చోట కి వెళ్తాడు. నీటిలో నంది పెద్ద విధ్వంసం సృష్టిస్తాడు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి పై ప్రభావం పడుతుంది. అయితే పార్వతీ తండ్రి పెద్ద మత్సకారుడు అవడంతో.. ఎవరైతే ఆ సొర చేపను పట్టుకుంటారో వారికి అతను పార్వతీ దేవిని ఇచ్చేస్తానని చెప్తాడు.
చాలా మండి మత్స్యకారులు ఆ సొర చెప్పాను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఓడిపోతారు. పరమ శివుడు మత్సకారుడిలా వెళ్లి ఆ సొర చేప ని పట్టుకుంటాడు. దీనితో తిరిగి మళ్ళీ పార్వతి దేవి, పరమ శివుడు కలసి పోతారు తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్ళి పోతారు,
End of Article