Ads
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఇప్పటిది కాదు. దశాబ్దం క్రితం నుంచే ఆయనకు ఈ క్రేజ్ ఉంది. మహేష్ బాబు కు టాలీవుడ్ లో అందగాడు అన్న పేరు ఉండనే ఉంది. మరి అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూడా అతిలోక సుందరి అన్న బిరుదు ఉంది. శ్రీదేవి కి ఉన్న పాపులారిటీ కూడా తక్కువేమి కాదు.
Video Advertisement
మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన “నిజం” సినిమా గుర్తుంది కదా. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తల్లి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే హీరో గా నటించిన మహేష్ బాబు తల్లి పాత్ర ఏది చెప్తే అది చెయ్యాలి. అందుకే ఈ పాత్రకు బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ ను ఎంచుకోవాలని తేజ అనుకున్నారట. అందుకోసం శ్రీదేవి, జయసుధ, జయప్రద, రేఖ, విజయశాంతి వంటి అందరిని అడిగారట. కానీ జయసుధ తప్ప ఎవ్వరూ ఒప్పుకోలేదట.
జయసుధ గారు ఒప్పుకున్నప్పటికీ వేరే సినిమాల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. మిగిలిన వారంతా ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా.. మహేష్ వంటి అందగాడి పక్కన తల్లి పాత్రలో నటించడానికి ఎవరు ఇష్టపడలేదు. శ్రీదేవి కూడా అందుకే ఒప్పుకోలేదట. అందుకే ఈ పాత్ర లో ‘సీతామాలక్ష్మి’ తాలూకు తాళ్ళూరి రామేశ్వరి గారి చేత నటింప చేసారు. ఆమె ఈ పాత్రకి ప్రాణం పోశారని చెప్పాలి
End of Article