Ads
కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది వాడేవారు. అందుకు కారణం వీళ్లు అందించిన సెకండ్ కి ఒక్క పైసా సర్వీస్. అంతే కాకుండా సిగ్నల్ కూడా చాలా బాగా వచ్చేది. అయితే ఇంతగా క్రేజ్ సంపాదించుకున్న డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంటర్నెట్ నుండి సేకరించిన వివిధ ఆధారాల ప్రకారం డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయినందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
జపాన్ కి చెందిన ఎన్టీటీ డొకోమోతో కలిసి టాటా సంస్థ డొకోమోని టాటా డొకోమోగా భారతదేశంలో పరిచయం చేసింది. ఆ సమయంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని డబ్బులు కట్ చేసే వాళ్ళు. కానీ డొకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేసేది. ఈ కారణంగా మిగిలిన కంపెనీలు కూడా సెకండ్ లెక్కన డబ్బులు చార్జ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ కారణంగా మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్ 15 నుండి 12 శాతం వరకు తగ్గింది.
టాటా టెలి సర్వీసెస్ తీసుకొచ్చిన ఈ మార్కెటింగ్ స్ట్రాటెజీ వల్ల ఎంతోమంది మొబైల్ వాడే వాళ్ళకి లాభం కలిగింది. కానీ కంపెనీ రెవెన్యూ తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టీటీ డోకోమో ఈ వెంచర్ లో దాదాపు 14 వేల కోట్ల డబ్బులని ఇన్వెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, 2010 లో 2G స్కామ్ అందరి ముందుకు వచ్చింది. 2010 లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టెలికాం శాఖ, లైసెన్సుల జారీ విషయంలో చేసిన పొరపాటుకి సంబంధించిన నివేదికను వెల్లడించింది.
వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్, టెలికాం ఆపరేటర్లకు 2G లైసెన్సులు జారీ చేయడం వల్ల 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. అంతే కాకుండా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని బహిర్గతం చేసిన వారికి, అలాగే నకిలీ పత్రాలను సమర్పించిన వారికి, అంతే కాకుండా మోసపూరిత మార్గాలను ఉపయోగించి స్పెక్ట్రమ్ యాక్సిస్ చేసిన వారికి కూడా లైసెన్సులు జారీ చేయబడ్డాయి. ఈ 2G స్కామ్ డొకోమోపై కూడా ఎంతో ప్రభావం చూపింది.
అప్పటి నుంచి టాటా టెలి సర్వీసెస్ సరైన మార్గంలో వెళ్లలేకపోయింది. కంపెనీ టెలిఫోన్ టవర్లు సంఖ్య తగ్గించేశాయి. మార్కెట్ షేర్లలో ఈ కంపెనీ వాటా తగ్గిపోతూ వచ్చింది. డొకోమో, టాటా టెలి సర్వీసెస్ అధికారుల మధ్యలో అభిప్రాయభేదాలు రావడం మొదలయ్యాయి. వ్యాపారాన్ని ముందు ఎయిర్సెల్, తర్వాత వోడాఫోన్ కి అమ్మేద్దాము అని అనుకున్నారు. కానీ ఎటువంటి ఫలితం దొరకలేదు.
మిగిలిన టెలికాం సర్వీసెస్ కంటే ముందే డొకోమో 3G సర్వీసెస్ ని లాంచ్ చేసింది. కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో డొకోమో బయటికి వచ్చేద్దామని నిర్ణయించుకుంది. ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. చివరిలో డొకోమో డబ్బులు తీసుకొని టాటా సర్వీసెస్ నుండి వెళ్ళిపోయింది.
జూలై 2017 ప్రకారం టాటా డొకోమోకి కేవలం 3.16% యూజర్లు ఉన్నారు. అంటే దాదాపు 42 లక్షల మంది యూజర్లు అన్నమాట. ఇవన్నీ కాకుండా జియో రావడంతో మిగిలిన కంపెనీలన్నిటికీ మెల్లగా యూజర్లు తగ్గడం మొదలైంది. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేసేయాల్సి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వెల్లడించిన నివేదిక ప్రకారం టాటా టెలి సర్వీసెస్ కి దాదాపు 4,617 కోట్ల నష్టం వచ్చింది. ఈ కారణంగానే టాటా డొకోమో వారి సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
End of Article