ఇండస్ట్రీలో “సావిత్రి”కి ఇంత మంది శ్రేయోభిలాషులు ఉన్నా కూడా… చివరి రోజుల్లో వారు ఎందుకు ఆమెని పట్టించుకోలేదు..?

ఇండస్ట్రీలో “సావిత్రి”కి ఇంత మంది శ్రేయోభిలాషులు ఉన్నా కూడా… చివరి రోజుల్లో వారు ఎందుకు ఆమెని పట్టించుకోలేదు..?

by Anudeep

Ads

సావిత్రి.. ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు. మహానటి సావిత్రి గురించి తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి సావిత్రి గారు.

Video Advertisement

అందం, అభినయం.. కలగలసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి. ఏపాత్రలోనైనా జీవించండం ఆమెకు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగు సినిమాల్లో సావిత్రి ఎవరగ్రీన్ గా మిగిలిపోయారు. అయితే తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది.

జెమినీ గణేషన్ తో చాలా సినిమాలు చేసారామె. ఆయనతో ‘మనం పోల మాంగల్యం’ సినిమాలో నటిస్తుండగా ప్రేమలో పడి.. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. అప్పటికి జెమినీ గణేషన్ కు అది మూడో వివాహం. సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి.. జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. సావిత్రి గారు స్వతంత్ర నిర్ణయాలతో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాలు తీయడంతో భారీగా నష్టపోయారు. కృష్ణాజిల్లాలో ఆమెకున్న ఎస్టేటు అన్యాక్రాంతమైన ఆమె పట్టించుకోలేదు. ఆమె స్థాపించిన కంపెనీలు, శ్రీ విజయ చాముండేశ్వరి ప్రొడక్షన్స్, సావిత్రి సినీ సర్వీసెస్ లిమిటెడ్, విజయ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ లను పర్యవేక్షించే వాళ్ళు లేక నష్టాలతో మూతపడ్డాయి.

అంతకు ముందు ఆర్థిక వ్యవహారములను జెమినీ గణేష్ చూసుకునే వాడు. పురసవాక్కం ఎస్టేట్ ని కూడా అమ్మివేసారు. ఇదంతా జెమినీగారు సావిత్రి గారిని వీడిన తర్వాత జరిగినది. ఈ విధంగా నష్టపోయిన తరువాత ఆమె మత్తుకు బానిస అయింది. ఆ రకంగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆమె ఒక మద్రాసు మార్వాడీకి తన బంగళా కాగితాలు అప్పగించి దాని విలువ మీద కావలసినప్పుడల్ల డబ్బు తీసుకునే వారు. ఎంత తీసుకున్నారో రాసేవారు కాదు దీంతో ఆ బంగ్లా కూడా పోయింది. ఒక భర్తగా జెమినీ పర్ఫెక్ట్ పర్సన్ కానప్పటికీ పిల్లల చదువుల విషయంలో కొన్ని ఆలోచనలు ఉండేవి (ఆయన తన పిల్లలను ఉన్నత చదువులు చదివించారు) కానీ సావిత్రి ఆయన మాట సాగనివ్వలేదు. తన కూతురికి 16 ఏళ్లకే పెళ్లి చేసి పంపించింది. ఆ పెళ్లికి జెమినీని కూడా పిలవలేదు సావిత్రి.

ఆమె చనిపోయే వరకు మిగిలిన కొద్దిపాటి ఆస్తులు తన పేరు మీదనే ఉన్నాయి. ఆమెను వీడిపోయి దాదాపు పదేళ్ల తర్వాత – 1980 లో జెమినీ వేరొక కుటుంబంతో ఉండగా ఒకరోజు హఠాత్తుగా సావిత్రిగారు కోమాలో ఉన్నట్టు కర్ణాటక నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే అక్కడకు బయల్దేరారు. ఆ తర్వాత ఆమెను మద్రాస్ తరలించారు. ఆమెను బతికించడానికి ఆయన లక్షలు ధారపోసి చికిత్స చేయించినా ఆమె స్పృహలోనికి రాలేదు. ఆమె కన్ను మూసినట్లు 1981 డిసెంబరులో వైద్యులు ప్రకటించారు. కాబట్టి ఆమె విషాదములో జెమినీ గారి పాత్ర తక్కువే. పూర్తిగా కాకపోయినా ఈ విషయం చాలవరకు ఆనాటి మహానటులకు తెలుసు.

సావిత్రిగారు అప్పటికే చాలామంది టాప్ హీరోలతో కలిసి నటించారు. అందరితో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఆమె అన్ని కష్టాలు పడుతుంది అని తెలిసి కూడా ఎవరు ఎందుకు సాయం చేయడానికి ముందుకు రాలేదు అనే ప్రశ్నలు చాలామందిలో నెలకొన్నాయి కానీ సావిత్రి గారు నటి మాత్రమే కాకుండా ఒక స్టార్ హీరో భార్య కూడా.. స్టార్ హీరో భార్య కాబట్టి కొన్ని పరిమితులు ఉండేవి. ఆ హద్దు దాటి వారు ఎప్పుడూ నడుచుకోలేదు. అందుకే అంతమంది ప్రముఖుల పరిచయం ఉండి కూడా ఆమెకు ఎవరు సాయం చేయలేదు. ఒకవేళ చేద్దాం అనుకున్నా పై కారణాల వల్ల వాళ్ళు వెనుకడుగు వేసి ఉండొచ్చు.


End of Article

You may also like