మీ పూర్వీకులు కలలోకి వస్తే ఏమవుతుందో తెలుసా?

మీ పూర్వీకులు కలలోకి వస్తే ఏమవుతుందో తెలుసా?

by Mohana Priya

Ads

మనం నిద్రపోతున్న కూడా మన మెదడు పని చేస్తున్నప్పుడు వచ్చేవే కలలు. మనిషికి కలలు రావటమనేది ఎంతో సహజం. కలల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టే ఇంకొన్ని ప్రమాదకరమైనవి. కొన్ని కలలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు. అంటే పైన చెప్పిన రకాల్లో మనకొచ్చిన కల ఏ కోవకు చెందుతుందో తెలియని కలలు కూడా ఉంటాయి.

Video Advertisement

అందులో ఒకటే చనిపోయిన మన పూర్వీకులు మన కల లోకి రావడం. అలా వచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుందో, లేదా వాళ్ళు మనతో ఏదైనా చెప్పడానికి వచ్చారు లాంటి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ప్రతీ కలకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇలాంటి కలలకి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. అవేంటంటే

మామూలుగా హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకి కర్మ, అలాగే వాళ్లని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సంవత్సరీకం కూడా చేస్తాం. పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరికం చేసే కుటుంబాలలో మంచి జరుగుతుంది అని చెబుతారు. అలాగే ఆ చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని చెబుతారు.

చనిపోయిన వాళ్ళు నవ్వుతూ లేదా ఆశీర్వదిస్తున్నట్లు కనబడితే దాని అర్థం మనకి ఏదో మంచి జరుగబోతోంది అని. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే కానీ మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటే, పూర్తి చేయడం కష్టం అవుతున్న సమయంలో ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఆ ఇబ్బందుల నుండి నుండి మీకు బయటికి రావడానికి సహాయం చేస్తే అది పరోక్షంగా మీ పూర్వీకులు మీకు సహాయం చేసినట్లే. మీ పూర్వీకుల ఆశీస్సులు అలా వారి రూపంలో వచ్చి  మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి.

మీ పూర్వీకులు యాక్సిడెంట్ లాంటివాటిలో కాకుండా సహజ మరణానికి గురైతే, ఖచ్చితంగా వారు మీ మంచినే కోరుకుంటారు. వారు మీ కలలో వస్తే మీరు చేస్తున్న పనులు ఇంకా చేయబోయే పనులు సరిగా పూర్తవ్వాలని, మీరు జీవితంలో ఎంతో ముందుకెళ్లాలి అని వారు కోరుకుంటున్నారు అని అర్థం.

మీకు అనుకోని సమయంలో డబ్బులు వచ్చిన, కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించిన, తలపెట్టిన పనులు సమయానికి పూర్తి అయిన, అలాగే ఎప్పటినుండో వాయిదా పడిపోయిన పనులు పూర్తయినా కూడా అందులో పూర్వీకుల ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి.అది కూడా ప్రత్యేకించి కర్మలు చేసే సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే కచ్చితంగా అందులో మీ పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా ఉన్నట్టు అర్థం.


మీరు మీ తోబుట్టువులను తల్లిదండ్రులను బాగా చూసుకుంటునట్లయితే మీ చనిపోయిన పెద్దవాళ్ళ దీవెనలు మీకు మెండుగా ఉంటాయి. ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ పూర్వీకులు కలలో కనిపించిన ఇప్పుడు జరిగే విషయాలు. కానీ మీకు కలలో పాములు రావడం కూడా మీ పూర్వీకులకు సంబంధించిన విషయమే. అవును. మీకు కలలో పాములు కనబడితే మీ పూర్వీకులు ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటారు, మీరు చేసే ప్రతి మంచి పనికి వారి ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి అని అర్థం. అలాగే వారు ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్నట్టు మనకు చెబుతున్నట్టు కూడా ఆ కల సూచిస్తుంది.

representative image

ఇవన్నీ శాస్త్రాలు చెబుతున్న విషయాలు. కానీ ఒకసారి మనం సాధారణంగా ఆలోచిస్తే ఇలా కలలు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు ఒకవేళ రోజు మొత్తంలో ఆ వ్యక్తిని ఒక్కసారైనా గుర్తు చేసుకున్నప్పుడు, అలా గుర్తు చేసుకున్న సమయంలో మీ మెదడు దృష్టి అని ఆ విషయం మీద కేంద్రీకరిస్తే, తర్వాత మనం వేరే ఎన్ని పనులు చేసుకున్నా, మనం ఆ వ్యక్తి గురించి శ్రద్ధతో విన్నాం కాబట్టి ఆ విషయం మన మెదడులో స్టోర్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి మన కలలోకి వస్తారు అని కూడా అంటారు.

representative image

ఏది ఏమైనా దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే మన పూర్వీకులు ఒకవేళ మన కలలోకి రావడానికి దాదాపుగా ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడం, మనకు ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికే అని తెలుస్తోంది.


End of Article

You may also like