కుక్కలు ఎక్కువగా వాహనాల టైర్ల వద్దే ఎందుకు కాలు ఎత్తి మూత్రం పోస్తాయి..?

కుక్కలు ఎక్కువగా వాహనాల టైర్ల వద్దే ఎందుకు కాలు ఎత్తి మూత్రం పోస్తాయి..?

by Mohana Priya

జంతువులలో మనుషులకు తొందరగా మచ్చిక అయ్యేవి కుక్కలు. ఇవి ఫ్రెండ్లీ గా ఉండడమే కాదు విశ్వాసపాత్రులుగా కూడా ఉంటాయి. తమ యజమానులు కనబడకపోతే రెండు రోజులు మూడీగా అయిపోయి తినడం కూడా మానేస్తాయి.

Video Advertisement

అంత ప్రేమ ఉన్న కుక్కలు మూత్రం పొసే విషయంలో నిక్కచ్చిగా ఉంటాయి. అంటే.. అన్ని కుక్కలు కాకపోయినా చాలా వరకు పెట్ డాగ్స్ పర్టిక్యులర్ గా తమకు అలవాటు అయిన చోటే మూత్ర విసర్జన చేస్తాయి.

dog 1

మీరు గమనించారా..? చాలా వరకు కుక్కలు ఎక్కువగా వాహనాల టైర్ల వద్దే కాలు ఎత్తి మూత్రం పోస్తూ ఉంటాయి.. చుట్టూ అంత ప్లేస్ ఉన్నా.. అవి టైర్ల వద్దకే వచ్చి ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా..? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్ గా వాహనాలు ఏవైనా రోడ్డుపై రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి. తారు రోడ్లు అయితే కొంతవరకు శుభ్రంగానే ఉన్నప్పటికీ.. మట్టిరోడ్లపై తిరిగినప్పుడు.. బురదలో తిరిగినప్పుడు వాహనాల టైర్లకు ఎక్కడలేని చెత్త అంటుకుంటుంది.

dog 2

ఇది కంటికి కనిపించకపోయినా.. చాలావరకు చెత్త కంపు కొడుతూ ఉంటాయి. కుక్కలు అటు ఇటు తిరుగుతూ.. వాహనాల టైర్ల వాసన చూసినప్పుడు.. అది చెత్త వాసన వస్తుండడం వలన వాటిని అవి చెత్త ప్రదేశంగా భావించి మూత్ర విసర్జన చేస్తాయి. కేవలం వాసన పసిగట్టడం వల్లే అవి అలా మూత్ర విసర్జన చేస్తాయి. టైర్లు మాత్రమే కాదు.. శుభ్రం చేయకుండా పడేసిన వస్తువులు కూడా అపరిశుభ్ర వాసన వేస్తూ ఉంటె.. కుక్కలు మూత్ర విసర్జన చేయడానికి అవకాశం ఉంటుంది.


You may also like