పక్షుల గుంపు “V” ఆకారంలోనే ఎందుకు పయనిస్తుందో తెలుసా.?

పక్షుల గుంపు “V” ఆకారంలోనే ఎందుకు పయనిస్తుందో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని మనుషులు తిరిగే ప్రదేశాలలో కూడా కనిపిస్తూ ఉంటే, కొన్ని మాత్రం జనసంచారం లేని ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు మాత్రం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి చాలా అరుదైన పక్షులు. అయితే ఇలాంటి పక్షుల్లో ఒకటి గీస్ అంటే పెద్ద బాతులు.

Video Advertisement

ఈ పెద్ద బాతులు మనం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పెద్ద బాతులు అన్నీ ఎగిరేటప్పుడు “వి” ఆకారంలో ఎగురుతాయి. ఇందుకు ఒక కారణం ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఎగరడం వల్ల వాటి శక్తి ఆదా అవుతుంది. అంటే ప్రతి ఒక్క పక్షి దాని ముందు ఉన్న పక్షికంటే కొంచెం ఎత్తులో ఎగురుతూ ఉంటుంది.

దీని కారణంగా విండ్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. విండ్ రెసిస్టెన్స్ అంటే గాలి ఒక కదిలే యొక్క వేగాన్ని తగ్గించడం. ఒక పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ పక్షి రెక్కల నుండి వచ్చే గాలి పక్షి రెక్కల మూమెంట్ తో పాటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక పక్షి తన రెక్కలని కిందకి ఆడించినప్పుడు గాలి కిందకి వెళుతుంది. మళ్ళీ పైకి ఆడించినప్పుడు గాలి పైకి వెళుతుంది. ఇలా ఎగురుతున్నప్పుడు ఆ పక్షి రెక్కల కదలిక ప్రకారం గాలి సర్కిల్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది.

 

అలా ఎగిరేటప్పుడు ఆ పక్షి తన రెక్కలు కిందకి ఆడించినప్పుడు వచ్చే గాలి ఒత్తిడికి గురయ్యి కిందకి వెళుతుంది. పైకి అన్నప్పుడు వచ్చే గాలి పైకి, పక్కకి వెళుతుంది. అందుకే ఒక పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు తన రెక్కలని పైకి ఆడించినప్పుడు వచ్చే గాలి తన వెనకాల ఉండే పక్షులు పైకి ఎగరడానికి సహాయం చేస్తుంది.

పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు దానికి ఎడమవైపు గానీ, కుడివైపు గానీ ఒక పక్షి ఎగురుతూ ఉంటే, ముందు ఉన్న పక్షి రెక్కలు పైకి కదిలించినప్పుడు వచ్చే గాలి వాళ్ళ వెనకాల ఉన్న పక్షులు కొంచెం ఎత్తుకి ఎగురుతాయి. సాధారణంగా అయితే ఒక పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు తన రెక్కలు ఆడించడానికి ఎంతో శక్తి కావాల్సి వస్తుంది. వలస వెళ్తున్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించాలి కాబట్టి పక్షులు తమ ముందు ఎగిరే వేరే ఒక పక్షి రెక్కల నుండి పైకి వచ్చే గాలిని ఉపయోగించుకొని వి ఆకారంలో పైకి ఎగురుతాయి.

watch video:


End of Article

You may also like