Ads
మనం ఇప్పటికీ కొన్ని చోట్ల మిలిటరీ హోటల్ అని బోర్డు చూస్తూ ఉంటాం. మిలిటరీ హోటల్ అంటే మిలిటరీ కి దానికి ఎటువంటి సంబంధం లేదు. మిలిటరీ లో పని చేసేవారికి దృఢంగా ఉండేదుకు మాంసాహారం ఎక్కువగా ఇస్తూ ఉండేవారు. ఇదివరకు కాలం లో శాఖాహారులు ఎక్కువగా ఉండేవారు. వారు ఇబ్బంది పడకుండా ఉండేదుకు మాంసాహార హోటల్ అని చూడగానే తెలిసేలాగా మిలిటరీ హోటల్ అని పేర్లు పెట్టారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పేర్లను కొనసాగిస్తున్నారు. అంతేగాని ఆ హోటల్స్ మిలిటరీ వాళ్ళ చేత నడపబడవు. వాటికీ మిలిటరీ కి సంబంధం లేదు.
Video Advertisement
పూర్వం భోజన హోటళ్ళు చాలా తక్కువ ఉండేవి. అన్నాన్ని అమ్ముకోకూడదని ఒక అలిఖిత నియమం ఉన్నందున ఎవరైనా బాటసారులు, అభ్యాగతులు వస్తే ఎంత లేని వారైనా కనీసం అన్నం మజ్జిగ పెట్టి పంపేవారు. తర్వాత ఆ పద్ధతి పోయి హోటల్స్ పుట్టుకొచ్చాయి. టిలో బ్రాహ్మణ హోటళ్ళు మొదటివి. వంట బ్రాహ్మణులు చేసే వారు. శాకాహారం లభించేది. అన్ని వర్ణాల వారూ వెళ్ళే వారు. ఇవి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నాయి. ఉడుపి హోటళ్ళు ఈ కోవకు చెందినవే.
మాంసాహారులు తినదగిన ఆహారం లభించేది కాదు. ఒక వేళ దొరికినా ఏ మాంసం వండుతున్నారో అని అనుమానంతో వెళ్ళేవారు కాదు. వారికోసం హిందూ మిలిటరీ భోజన హోటల్స్, రాజుల భోజన హోటల్స్.గోదావరి జిల్లాలలో మాంసాహార భోజనశాలలను రాజుల భోజన హోటల్ అని అంటారు. అది నడిపే వాళ్ళు రాజులూ కారు వండేవారు రాజులూ కారు.
అలాగే శాకాహార భోజన హోటళ్లను బ్రాహ్మణ బోజన హోటల్ అనడం కూడా మనం చూస్తాం. ప్రస్తుత కాలం లో మాంసాహారులు కూడా పెరగటం వల్ల హోటల్స్ విషయం లో అటువంటి ఇబ్బందులు ఏవి లేవు. ఇంతకుముందు కాలం లో చాలా మంది ఆడవాళ్ళూ ఇంట్లో మాంసాహారం వన్డే వాళ్ళు కాదు. అందుకే అటువంటి పరిస్థితుల్లో మిలిటరీ హోటల్స్ కి వెళ్లేవారు.
End of Article