Ads
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కచ్చితంగా ఉండాల్సినవి వాష్ రూమ్స్. ముఖ్యంగా ప్రయాణాలప్పుడు వాష్ రూమ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది కి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రభుత్వం కూడా ప్రతి చోట, అంటే ప్రయాణాలు మధ్యలో కూడా దారిలో వాష్ రూమ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్స్, మాల్స్, థియేటర్లలో కూడా వాష్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
Video Advertisement
అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? అదేంటంటే, థియేటర్స్, మాల్స్ లో వాష్ రూమ్ డోర్ పూర్తిగా క్లోజ్ అయ్యి ఉండదు. కింద వైపు కొంచెం ఓపెన్ గా ఉంటుంది. అలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.
# ఒకవేళ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదా ఇంకా ఏమైనా ఇబ్బంది అయ్యి వాష్ రూమ్ లో పడిపోవడం వంటివి జరిగితే గుర్తించడానికి సులభంగా ఉంటుంది.
# మాల్స్, రెస్టారెంట్స్ లో ఉండేవి పబ్లిక్ టాయిలెట్స్ కాబట్టి తరచుగా శుభ్రం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు శుభ్రం చేయడానికి ఈజీగా ఉంటుందని డోర్ కొంచెం పైకి ఉండేలా ఏర్పాటు చేస్తారు.
# వెంటిలేషన్ కి సులభంగా ఉంటుంది. అలాగే వాష్ రూమ్స్ లో వచ్చే వాసన కూడా బయటికి వెళ్లిపోతుంది.
# ఎవరైనా ప్రైవసీని అడ్వాంటేజ్ గా తీసుకొని పబ్లిక్ వాష్ రూమ్స్ లో చేయకూడని పనులు చేస్తే కనిపెట్టే వీలు ఉంటుంది.
# పెద్ద డోర్ కట్టాలి అంటే ప్లాన్ కావాలి. దాంతోపాటు ఎక్కువ మెటీరియల్ వాడాలి, అందుకే ఇలాంటి డోర్స్ కొంచెం ఖర్చును కూడా తగ్గిస్తాయి.
# డోర్ పూర్తిగా కవర్ చేసి ఉంటే కొన్ని సందర్భాల్లో వాష్ రూమ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం తెలియదు. డోర్ కింద కొంచెం ఓపెన్ చేసి ఉంటే వాష్ రూమ్ ఖాళీగా ఉందా లేదా అని చూడటానికి ఈజీగా ఉంటుంది.
# ఎప్పుడైనా డోర్ స్ట్రక్ అయిపోయినప్పుడు బయటికి రావడానికి వీలుగా ఉంటుంది.
# టాయిలెట్ పేపర్ లాంటివి అయిపోయినప్పుడు ఇవ్వడానికి కూడా సులభంగా ఉంటుంది.
# లోపల ఉన్న వాళ్లకి బయట వేరే వాళ్ళు ఎదురుచూస్తున్నారనే విషయం తెలుస్తుంది.
End of Article