Ads
మనం రోజూ చాలా వాహనాల వెనకాల విచిత్రమైన కొటేషన్స్ చూస్తూ ఉంటాము. ఇందులో కొన్ని బైక్స్ ఉంటాయి. కొన్ని కార్లు ఉంటాయి. వీటిపై మాత్రమే కాకుండా ఇంకొక ఫోర్ వీలర్ పై కూడా ఇలాగే డిఫరెంట్ కొటేషన్స్ ఉంటాయి అదే లారీ.
Video Advertisement
లారీ వెనకాల కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కొటేషన్స్ రాసి ఉంటాయి. కొన్ని ఏమో నవ్వు తెప్పించేలా ఉంటాయి.
అయితే లారీ, ట్రక్స్ వెనకాల మనం తరచుగా చూసే ఒక నోట్ మాత్రం హార్న్ ఓకే ప్లీజ్. హార్న్ ప్లీజ్ అంటే సరే కానీ, హార్న్ ఓకే ప్లీజ్ కి అర్థం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మనం రోజూ చూసే వాటిలో చాలా విషయాలకి మనకి అర్థం తెలియదు. బహుశా ఇది కూడా ఆ కోవకే చెందుతుంది ఏమో. హార్న్ ఓకే ప్లీజ్ అనే పదం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిస్టరీ లో ఉన్న ఒక థియరీ ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ట్రక్స్ మీద ఓకే (OK) అని రాసేవారు. ఓకే అంటే ఆన్ కిరోసిన్ (On Kerosene) అని అర్థం. అంటే ఆ బండి కిరోసిన్ మీద నడుస్తోంది అని అర్థం. ఇది అప్పట్లో ఒక హెచ్చరిక లాగా వాడేవారు. అంటే కిరోసిన్ తో బండి నడుస్తోంది కాబట్టి ఒకవేళ చిన్న ఎగ్జిట్ అయినా కూడా పెద్ద ప్రమాదం జరగొచ్చు అని ఆ హెచ్చరిక వాడేవారు. అదే ఇప్పటి వరకు పాటిస్తున్నారు. దీన్ని మనం తరచుగా చూస్తూనే ఉంటాం కానీ దీని అర్థం మాత్రం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. హార్న్ ఓకే ప్లీజ్ వెనకాల ఉన్న అర్థం ఇదే.
ఇంతకుముందు OTK అని రాసేవారు. overtake అని అర్ధం. హార్న్ కొట్టి ఓవర్టేక్ చేయమని అర్ధం. అంతేకాకుండా వెనక వాహనంలో ఉన్న డ్రైవర్ ok ని క్లియర్ గా చూడగలంటే సేఫ్ డిస్టెన్స్ లో ఉన్నారని అర్ధం.
End of Article