Ads
పెళ్లి తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరిగిపోతారు. పెళ్లికి ముందు ఎంత సన్నగా ఉన్నా సరే పెళ్లి తర్వాత మహిళల బరువులో మార్పు వస్తుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా..? ఎందుకు మహిళలు పెళ్లి తర్వాత లావుగా తయారవుతారు అనేది.. కానీ సరైన జవాబు మీకు దొరకలేదా…?
Video Advertisement
అయితే ఇక్కడ సరైన సమాధానం మీరు ఇక్కడ తెలుసుకోచ్చు. మరి ఇక దీని కోసం ఓ లుక్ వేసేయండి. పెళ్లి తర్వాత సన్నగా ఉన్నవారు కూడా బొద్దుగా మారుతారు. అలాగే లావుగా ఉన్నవారు కూడా మరింత ఒళ్ళు చేస్తారు. దీనికి గల కారణాలు ఇవే..
పెళ్లికి ముందు కష్టపడి పనిచేసే వాళ్లు కూడా పెళ్లి తర్వాత ఆ పనులు చేయడానికి గ్యాప్ వస్తుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు.
అదేవిధంగా పెళ్ళికి ముందు చదువు, ఉద్యోగం మొదలైన టెన్షన్స్ ఉంటాయి. ఆ కారణంగా తినడంపై పెద్దగా శ్రద్ధ వహించరు. దాంతో అధిక బరువు సమస్య రాదు. అంతేకాకుండా చదువుకోవడం లాంటి పనుల వల్ల క్యాలరీలు చాలా కరుగుతాయి. కానీ పెళ్లి తర్వాత పనితో పాటు తిండి తినడం కూడా ఎక్కువ అవుతుంది.
పెళ్లి తర్వాత బద్ధకం ఎక్కువగా మహిళల్లో పెరుగుతుంది. కొన్నిసార్లు పనులు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మెల్లగా చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువగా చేయరు కూడా. దీని కారణంగా కూడా లావుగా మారిపోతారు.
అలానే పెళ్లి తర్వాత మహిళలు ఆహారం విషయంలో మరింత జాగ్రత్త పడతారు. ఏదైనా ఆహారం మిగిలిపోతుందేమో అని వృధా చేయకూడదు అనే ఆలోచనతో తినడం మొదలు పెడతారు. ఇది కూడా బరువు పెరగడానికి దారి తీస్తుంది.
పెళ్లికి ముందు చాలా మంది రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తారు. పెళ్లి తర్వాత బ్రేక్ వస్తుంది. వ్యాయామం చేయరు. దీని కారణంగా బరువు పెరుగుతారు.
సైంటిస్ట్స్ చేసిన సర్వే ప్రకారం ఒక విషయం తేలింది. అదేంటంటే ప్రపంచంలో ఏ జంట పెళ్లి చేసుకున్నా.. పెళ్లి తర్వాత కొన్ని రోజులకు కచ్చితంగా రెండు కిలోల బరువు పెరుగుతారు. ఇలా ఈ కారణాల వలన పెళ్లి తర్వాత మహిళలు లావు అవుతారు.
End of Article