“లేడీస్ ఫస్ట్” అంటారు..! కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంకా వెనకే ఉన్నారు..?

“లేడీస్ ఫస్ట్” అంటారు..! కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంకా వెనకే ఉన్నారు..?

by Anudeep

Ads

లేడీస్ ఫస్ట్.. ఈ మాట తరచూ మనం వింటూనే ఉంటాం. ఏదైనా చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏదైనా చెప్పాలి అన్నా.. ఎవరు ముందు అనే మీమాంసలో ఉంటే వెంటనే లేడీస్ ఫస్ట్ అంటారు. ఇన్నీ విషయాల్లో లేడీస్ ఫస్ట్ అంటూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

Video Advertisement

ఇంట్లో అందరూ తిన్నాకే అమ్మ తింటుంది. అందరూ పడుకున్నాకే అన్నీ సర్ది అమ్మ పడుకుంటుంది. అందుకే అమ్మ గురించి ఓ గొప్ప మాట ఉంది. “తినవలసిన వ్యక్తులు నలుగురు ఉన్నప్పుడు, తినడానికి 3 రొట్టెలే ఉన్నప్పుడు.. నాకు ఆకలిగా లేదు అనే మొదటి వ్యక్తి అమ్మే”.

Story of a divorced woman

అందుకేనేమో ఇంట్లో ఆడవాళ్లు అందరూ తిన్నాక మిగిలింది తింటారు. అందరూ ప్రశాంతంగా పడుకున్నారు అని తను నిశ్చయించుకొన్నాకే చివరికి పడుకుంటారు.ఇంట్లో ఉండే ఆడవారంటే అనేకమందికి అదో రకమైన చులకన భావం ఉంటుంది. భర్త బయట కష్టపడి సంపాదిస్తే.. ఇంట్లో ఖాళీగా కూర్చోని తింటుంటారు అన్నట్టు ఉంటుంది వాళ్ళ వాలకం. కానీ ఇంట్లో క్షణం తీరిక లేకుండా గడిపేది వాళ్లే అని గుర్తించరు. వాళ్ళ ఆకలిని, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మనకు అన్ని సమకూర్చి పెడతారు వాళ్ళు.

why do women in households eat at last

మన ఇంట్లో అన్నీ సజావుగా సాగుతున్నాయి అంటే దానికి కారణం వాళ్లే అని ఎవరు గుర్తించకపోగా సూటిపోటి మాటలతో వారిని బాధిస్తాం. ఇంత చేసినా తిరిగి మన నుంచి ఏం ఆశించరు. కనీసం “నువ్వు తిన్నావా” అని అడిగే వారు కూడా తక్కువే మనలో. మళ్లీ దీనికి మన సంస్కృతి.. సంప్రదాయం అని కలరింగ్ ఇస్తాం. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ యూజర్ అన్షిక అన్నింట్లో లేడీస్ ఫస్ట్ అంటారు కానీ మా అమ్మ మాత్రం లాస్ట్ కే తింటుంది అని పోస్ట్ చేసారు.

why do women in households eat at last

దీనికి అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ.. అది తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ అని కొందరంటే.. కుటుంబం పట్ల బాధ్యత అని మరికొందరు కామెంట్ చేశారు. కొందరు ఇది పితృస్వామ్య కట్టుబాట్లలో భాగం అని అంగీకరించారు. ఇంకొందరు మాత్రం ఇది పబ్లిక్ గా చర్చించడం ఏంటని అన్షికను విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని మాటలు బయట ఆదర్శలకే కానీ ఇంట్లో ఆచరణకు పనికిరావు అని మనం అర్ధం చేసుకోవాలి.

NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.


End of Article

You may also like