Ads
మనలో చాలా మందికి ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. కొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెలింగ్ ఇష్టపడితే, ఇంకొంత మంది మాత్రం తమ సొంత వాహనాల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రయాణాల్లో చాలా మంది విండో సీట్ ప్రిఫర్ చేస్తారు. చుట్టూ ఉండే పరిసరాలను చూస్తూ ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది బస్ లో అయినా, ట్రైన్ లో అయినా, లేదా ఫ్లైట్ లో అయినా సరే.
Video Advertisement
ఇంక ఫ్లైట్ లో అయితే మేఘాల దగ్గర నుండి ప్రయాణిస్తారు. మీరు ఒక విషయం గమనించారా? ట్రైన్ ఇంకా బస్ విండో స్క్వేర్ షేప్ లో ఉంటుంది, కానీ ఫ్లైట్ విండో మాత్రం ఓవెల్ షేప్ లో ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఫ్లైట్ విండో ఓవెల్ షేప్ లో ఉండటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతకు ముందు అంటే 1950 సమయంలో ఫ్లైట్ విండో షేప్ స్క్వేర్ గానే ఉండేది. కానీ ఒక కమర్షియల్ జెట్ లైనర్ కు చెందిన విమానాలు కొంచెం ఎక్కువ వేగంతో, ఎత్తులో వెళ్తున్నప్పుడు మిడ్ ఎయిర్ లో పడిపోయాయి. అందుకు కారణం స్క్వేర్ షేప్ ఉన్న విండోలు. ప్లేన్ ఆల్టిట్యూడ్ పెరిగితే, ఎక్స్టర్నల్ అట్మాస్ఫరిక్ ప్రెజర్, ఇంటర్నల్ క్యాబిన్ ప్రెజర్ కంటే తక్కువగా ఉంటుంది.
ఇది ప్లేన్ బయట ఇంకా లోపల ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ప్లేన్ కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక మెటీరియల్ ఇలా షేప్ మారుతూ ఉంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మెటీరియల్ ఎక్స్పాండ్ అవుతున్నకొద్దీ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ స్ట్రెస్ ఎక్కువైతే మెటీరియల్ బ్రేక్ అవుతుంది. ప్లేన్ లో విండో షేప్ అనేది స్ట్రెస్ పై ప్రభావితం అవుతుంది.
షార్ప్ గా ఉన్న కార్నర్స్ వీక్ స్పాట్స్ గా ఉంటాయి. అంటే కార్నర్స్ లో స్ట్రెస్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఎయిర్ ప్రెజర్ వల్ల కార్నర్స్ ఇంకా వీక్ అవుతాయి. ఒక స్క్వేర్ కి నాలుగు కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు కార్నర్స్ లో ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ప్రెజర్ ఎక్కువ అయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కార్నర్స్ కర్వ్డ్ షేప్ లో అంటే కార్నర్ షార్ప్ గా కాకుండా వంగి ఉంటే, వాటికి ఫోకల్ పాయింట్ ఉండదు.
దాంతో స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు క్రాక్స్ రావడం, బ్రేకేజ్ జరగడం, లేదా ఇతర ప్రమాదాలు జరగడం తగ్గుతాయి. సర్క్యులర్ షేప్ లో ఉండేవి ఏవైనా చాలా బలంగా ఉంటాయి, డిఫార్మేషన్ అవ్వకుండా ఆపగలుగుతాయి. ఫ్లైట్ లోపల అలాగే బయట ఉండే ఒత్తిడిని తట్టుకోగలుగుతాయి. అందుకే ఫ్లైట్ విండోస్ రౌండ్ గా అంటే ఓవెల్ షేప్ లో ఉంటాయి.
End of Article