Ads
మన మోచేతికి ఏమైనా తగిలితే ఏదో షాక్ కొట్టినట్లు ఉంటుంది. అయితే ఎందుకు అలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇలా చాలా మందికి ఎన్నోసార్లు అనిపించినా ఎందుకు అలా అనిపిస్తుంది అనేది తెలియదు. దాని వెనుక ఉండే కారణం గురించి మర్రి ఇప్పుడే చూడండి.
Video Advertisement
మన మోచేతి దగ్గర బొడుపులా ఉన్న ఎముక పక్కనుండి ఒక నరం వెళ్తుంది. అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గర్నుంచి చేతివేళ్ళలోకి వెళ్ళే సర్వైకల్ నరాల్లో ఒకటైన అల్నార్ నర్వ్. ఒకవేళ కనుక పొరపాటున అక్కడ దెబ్బ తగిలితే మెదడు సిగ్నల్స్ ని మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ఫన్నీ బోన్ పెయిన్ అనేది వస్తుంది.
కొంత మందిలో ఇది క్షణం పాటు వుంది వెళ్ళిపోతుంది. మరి కొందరికి మాత్రం దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. దీంతో వాళ్ళకి తిమ్మిరి, స్పర్శ లేకపోవడం, నొప్పి కలగడం లాంటివి జరుగుతాయి. దీనికి గల కారణం ఏమిటంటే అక్కడ నరం పూర్తిగా నొక్కుకు పోవడమే.
అయితే ఎందుకు ఇలా వస్తుంది అనేది చూస్తే… అదే పనిగా మోచేతిని బల్ల మీద ఎప్పుడూ ఆనించి ఉంచడం వల్ల లేదు అంటే తల కింద చేయి పెట్టుకుని నిద్ర పోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే అల్నార్ నరం నొక్కుకుపోతుంది. దీని నుంచి ఎలా బయటపడాలి అనేది చూస్తే.. మోచేతులు మడత పడకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. బాగా ఎక్కువ ఇబ్బంది ఉంటే శస్త్రచికిత్స చేసి ఆ అల్నార్ నరంపై ఒత్తిడిని తొలగించాల్సి ఉంటుంది.
End of Article