ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లోగోల మీద ఎక్కువగా ఈ రంగులే ఉంటాయి.? ఎందుకో తెలుసా.?

ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లోగోల మీద ఎక్కువగా ఈ రంగులే ఉంటాయి.? ఎందుకో తెలుసా.?

by Mohana Priya

Ads

మనిషికి తిండికి ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. కొంత మంది బతకడం కోసం తింటే, కొంత మంది తినడం కోసం బతుకుతారు. ఏదేమైనా సరే, మనిషికి ఆహారం మాత్రం చాలా ముఖ్యం. మనిషికి మాత్రమే కాదు. ఊపిరి పీల్చుకునే ఏ జీవికైనా సరే ఆహారం చాలా ముఖ్యం. అయితే రోజు ఒకటే రకం ఆహారం తినలేము కాబట్టి ఎన్నో కొత్త కొత్త రకాల ఆహారాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. ఒకసారి ఇంట్లో ఆహారం తినలేక బయట హోటల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటాం.

Video Advertisement

why does food court logos have yellow and red colors

ఈ మధ్య స్విగ్గి, జొమాటో వచ్చిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్ కూడా బాగానే చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మనం వెళ్లే హోటల్ లేబుల్ లో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లేబుల్ లో ఎక్కువగా ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ ఉంటుంది. అలా ఉన్నది డిజైన్ కోసం అనుకుంటే మాత్రం పొరపాటే. అలా హోటల్ లేబుల్ లో ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ ఎక్కువగా ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

why does food court logos have yellow and red colors

#1 ఎరుపు రంగు

ఎరుపు రంగు మనిషి శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. ఈ రంగు చూస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది. దీని ద్వారా ఆకలి అనేది కూడా పెరుగుతుంది.

why does food court logos have yellow and red colors

#2 పసుపు రంగు

పసుపు రంగు సంతోషానికి సంకేతం. పగటి పూట ఎక్కువ బ్రైట్ గా కనిపించే రంగు పసుపు రంగు. దాంతో ఎక్కడైనా మనం ఫుడ్ జాయింట్ వెతుకుతూ ఉంటే దూరంలో ఉన్నా కానీ పసుపు రంగుని  చూసి అది ఫుడ్ జాయింట్ అని కనిపెట్టొచ్చు.

why does food court logos have yellow and red colors

ఇవి మాత్రమే కాకుండా సైకాలజీకి సంబంధించిన ఒక కారణం కూడా ఉంది. అది ఏంటంటే, మన బ్రెయిన్ అనేది పదాల కంటే ముందే రంగులని తొందరగా గ్రహిస్తుంది. అందుకే ఫుడ్ జాయింట్స్ అందులోనూ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ ఈ రంగులను వారి లోగోలో ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాయి. అంతే కాకుండా ఎరుపు రంగు, పసుపు రంగు ఆకలిని పెంచుతాయి. ఆ హోటల్ కి కానీ, ఫుడ్ జాయింట్ కి కానీ వెళ్లి తినేలా ప్రేరేపిస్తాయి. ఈసారి మీరు హోటల్ కి వెళ్ళినప్పుడు ఈ రెండు రంగుల్లో ఏదైనా ఒక రంగు ఉందేమో గమనించండి.


End of Article

You may also like