సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృ మూర్తి ఇందిరా దేవి గారు సెప్టెంబర్ 28 తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. కాగా తెల్లవారు జామున నిద్రలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Video Advertisement

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి అయిదుగురు పిల్లలు. పలు దేశాల్లో ఈ కుటుంబానికి చెందిన వాళ్లు సెటిల్ అయ్యారు. ఇందిరా దేవి గారి మరణ వార్త తెలిసిన వెంటనే కొందరు ఇండియాకి తిరగి రాగా.. కొందరు మాత్రం రాలేక పోయారు. మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ నానమ్మ మృత దేహం వద్ద కనిపించ లేదు.

why gowtham krishna not attending garnd mother funeral
దీంతో చాలా మంది గౌతమ్ కృష్ణ ఎక్కడ అని వెతుకుతున్నారు, సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణ నానమ్మ వద్ద ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా అంటూ శోధిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే గౌతమ్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

why gowtham krishna not attending garnd mother funeral

విదేశాలకు మొదటి సారి చదువు నిమిత్తం ఒంటరిగా వెళ్తున్న గౌతమ్ ని విడిచి ఉండడం కాస్త కష్టమే అన్నట్లుగా నమ్రత కూడా గౌతమ్ యొక్క ఫోటోను షేర్ చేసి తన ఫీలింగ్ ని తెలియజేసింది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు గౌతం విదేశాల్లోనే ఉన్నాడని అర్థమవుతుంది. అందుకే నానమ్మ మృత దేహం వద్ద సితార మాత్రమే కనిపించింది, గౌతమ్ లేడు అభిమానులు కొందరు భావిస్తున్నారు.

why gowtham krishna not attending garnd mother funeral

నానమ్మతో ఉన్న బాండింగ్ తో సితార వెక్కి వెక్కి ఏడ్చిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గౌతమ్ కి కూడా నానమ్మ ఇందిరా దేవి గారితో మంచి బాండింగ్ ఉంది. సెలవులు వచ్చిన ప్రతి సారి పిల్లలిద్దరూ నాన్నమ్మ దగ్గరకు వెళ్లడం అలవాటు. అందుకే సితార అంతగా ఏడ్చింది. గౌతమ్ ఉండి ఉంటే కచ్చితంగా తను కూడా కన్నీళ్లు పెట్టుకునే వాడు. పాపం గౌతం విదేశాల్లో ఉండి నానమ్మ చివరి చూపును నోచుకోలేక పోయాడు అంటూ పలువురు అంటున్నారు.

why gowtham krishna not attending garnd mother funeral
అనారోగ్య సమస్యలతో మరణించిన ఇదిరా దేవి గారి భౌతికకాయాన్ని ఎక్కువ సమయం ఉంచేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడలేదు. మరణించిన కొన్ని గంటల్లోనే ఆమె భౌతికకాయాన్ని ఖననం చేయడం జరిగింది. ఆమె అంత్యక్రియలు చాలా స్పీడ్ గా జరిగాయి. గౌతం తో పాటు కుటుంబానికి చెందిన మరికొందరు కూడా ఇదిరా దేవి గారి చివరి చూపుకు నోచుకోలేక పోయారు.