Ads
ఐపీఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్. దీని కోసం చాలా మంది కలలు కంటారు. కఠోర సాధనతో ఇందులో ఎంపికవుతారు. ఇందులో ఎంపికయ్యాక వారికి కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ను ఇస్తారు.
Video Advertisement
ఆ తరువాత పోస్టింగ్ ఇస్తారు. అయితే.. ఈ ట్రైనింగ్ సమయం లో వారి జుట్టుని చాలా చిన్నగా కత్తిరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా… పోలీస్ ట్రైనింగ్ టైం లో హీరోలు కూడా షార్ట్ హెయిర్ తో కనిపిస్తారు. ఇలా ఎందుకు అంటే.. ట్రైనింగ్ తీసుకునే సమయం లో పోలీసులు చాలా కష్టపడతారు. వారికి ఇచ్చే టాస్క్ లు ఎలా ఉంటాయి అంటే.. తాళ్లు ఎక్కడం, నేలపై పాకడం, జంప్ చేయడం… ఇలాంటివి చేసే సమయం లో జుట్టు ముఖం మీద పడడం వలన గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టుని కత్తిరించేస్తారు.
అలాగే అందరికి ఒకటే యూనిఫామ్ ని ధరింప చేస్తారు. దీనివలన కుల, మత, ధనిక, పేద వర్గాల బేధం లేకుండా అందరు ఒక్కటే అనే భావం లో ట్రైనింగ్ ను పొందుతారు.ఐపీఎస్ కి ఎంపిక అయ్యి ట్రైనింగ్ తీసుకునే వారు విధిగా రూల్స్ ని పాటించాలి. కచ్చితం గా హెయిర్ కట్ ను వారు చెప్పిన్నట్లే చేయించుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో ఉన్నపుడు ఎక్కువ భాగం శారీరక శ్రమకు కేటాయిస్తారు.
ఫ్యాషన్ కోసం జుట్టుని కత్తిరించుకోవడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అదే షార్ట్ హెయిర్ కట్ అయితే చాలా తొందరగా పూర్తి అయిపోతుంది. ఐపీఎస్ అంటే..ఎంతో కఠినమైన శ్రమ.. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ అభ్యర్థులకు ముందే అర్ధం అయ్యేలా చెప్పడం కోసమే.. ట్రైనింగ్ కి ముందే జుట్టుని కత్తిరించేస్తారు.
End of Article