198
Ads
మన దేశంలో కేవలం తీవ్రమైన నేరాలు చేసిన వారికి మాత్రమే ఉరిశిక్ష విధిస్తారన్న సంగతి తెలిసిందే. ఉరిశిక్ష విధించబడిన నిందితులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవచ్చు. అక్కడ శిక్షను రద్దు చేస్తే.. ఆ నిందితులకు జీవితఖైదు విధిస్తారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రం రాష్ట్రపతి అలా ఎన్నడూ క్షమాభిక్ష పెట్టేందుకు యత్నించరు. ఇక ఉరిశిక్ష అమలయ్యే తేదీ రోజు నిందితులను ఉరి తీసేముందు అధికారులు కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే…
Video Advertisement
- నిందితులకు ఉరిశిక్షను మన దేశంలో తెల్లవారుజామున 4 గంటలకు అమలు చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో జనాలందరూ నిద్రపోతుంటారు. ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు కనుక.. ఆ సమయంలోనే ఉరిశిక్షను అమలు చేస్తారు.
- ఉరిశిక్ష పడ్డ ఖైదీలను శిక్ష విధించే రోజు ఉదయం 3 గంటలకు నిద్రలేపుతారు. వారు నిత్యం చేసే పలు కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుంది.
- ఉరిశిక్ష నిందితులకు తమ ఇష్టం వచ్చిన నీటితో స్నానం చేసేందుకు అవకాశం కల్పిస్తారు. వేడినీరు, చల్లనినీరు ఏదైనా సరే.. అందజేస్తారు.
- నిందితులకు ఇష్టమైన ఆహారం ఏదో కనుక్కుని ముందు రోజే సిద్ధం చేసి ఉంచుతారు. దాన్ని ఉరి తీసేముందు నిందితులకు అందజేస్తారు.
- ఇష్టమైన ఆహారం తిన్నాక కొంత సమయం ఒంటరింగా ఉండేందుకు అనుమతిస్తారు. ఆ సమయంలో నిందితులు తమ కుటుంబ సభ్యులను తలచుకోవచ్చు. వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. లేదా ఇష్టమైన పుస్తకం చదవవచ్చు. మరే పనైనా చేయవచ్చు.
- దైవం మీద నమ్మకం ఉన్నవారికైతే ఆధ్యాత్మిక పుస్తకాలు అందజేస్తారు. వాటితో ప్రార్థనలు చేసుకోవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
- డాక్టర్ చేత ఉరితీత నిందితులకు వైద్య పరీక్షలు చేస్తారు. నిందితులు అన్ని విధాలుగా.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెబితేనే ఉరి అమలవుతుంది.
- న్యాయమూర్తి నిందితులు చేసిన నేరాలను, వారికి పడ్డ శిక్షలు, ఇతర వివరాలను వారి పేర్లతో సహా సంక్షిప్తంగా చదివి నేరస్థులకు వినిపిస్తారు. అవసరం అయితే నిందితులకు తమ మాతృభాషలో అర్థమయ్యేలా ఆ వివరాలు చదివి వినిపిస్తారు.
- న్యాయమూర్తి నేరస్థుల వివరాలను చదివి వినిపించి వెంటనే అధికారులకు సైగ చేస్తారు. దీంతో ఉరి అమలవుతుంది.
- నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. వారిని ఉరితీసిన తలారి వివరాలను బయటకు వెల్లడించరు.
End of Article